హాస్యాంజలికి స్వాగతం...

అందరికి ఆహ్వానం

9, నవంబర్ 2009, సోమవారం

(దయచేసి పూర్తిగా చదవండి)
తెలుగు భాషాభిమానులందరికీ స్వాగతం. నా చదువు ఇంగ్లీష్ మీడియం అయినా నేను, తెలుగు భాషాభిమానినే అలాగని తెలుగులో పండితున్ని కాదు పామరున్ని మాత్రమే అందుకే అచ్చు తప్పులు దొర్లితే తెలుగువారు మన్నించాలి.
తెలుగు భాషంటే నాకెంతో అభిమానము అలాగని ఇంగ్లీష్ మరియు ఇతర భాషలంటే ఎలాంటి ద్వేశమూ లేదు కన్న తల్లి లాంటిది కాబట్టే పుట్టిన తరువాత మాట్లాడే భాషను మాతృభాష అని పిలుస్తారు. భార్యలాంటిది ఆంగ్లభాష అని నేననుకుంటాను.
నా ఉద్దేశంలో భార్యకోసం తల్లిని, తల్లికోసం భార్యని చులకన చేయడం తప్పిదమే ఔతుంది. మనమంటూ ఉన్నామంటే దానికి కారణం తల్లి, మనం మాటలు నేర్చుకోడానికి కారణం మాతృభాష. తల్లి తరువాత మనకోసం తపించేది భార్య, మనం రాష్ట్రాలు, దేశాలు దాటి మన తెలుగువారి ఖ్యాతిని పెంచడానికి ఆంగ్లభాష అవసరముంటుంది. కన్నతల్లి, కట్టుకున్నభార్య ఇద్దరూ రెండు కల్లలాంటివారు ఇద్దరూ సమానమేకదా.
నా మొదటి తెలుగు బ్లాగు రాంగోపాల్స్ బ్లాగులో సామాజిక విషయాలపై వ్రాసాను సమయం చిక్కకపోవడంవల్ల ఎక్కువ టపాలు వ్రాయలేకపోతున్నాను త్వరలోనే అందులో టపాలు వ్రాస్తాను.
నా రెండో తెలుగు బ్లాగు మీరు చూస్తున్న హాస్యాంజలి నేను విన్నా, చదివిన జోకులను ఇక్కడ వ్రాస్తున్నాను సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు. కొందరికి హాస్యమన్న హాస్యాన్ని గురించి మాట్లాడడమన్న అపహాస్యంగా ఉండవచ్చు. నా దృష్టిలో నవ్వు భాధలను తరిమికొట్టే టానిక్. అది మనిషికి మాత్రమే ఉన్న గొప్పవరం. "నవ్వుతూ బ్రతకాలి నవ్వుతూ చవాలనేదే నా కోరిక" మనం సంతోషంగా ఉంటేనే ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతాం.
తెలుగు భాష ఒకరి సొత్తు కాదు అలాగే తెలుగు హస్యాం ఒకరి సొత్తు కాదు. నేను విన్న జోకులను అందరితోని పంచుకొని వారిని కొంతైనా సంతోషపరచాలని బ్లాగుని రూపొందించాను. అలాగే ప్రతి ఒక్కరు హాస్యాన్ని అనుభవపూర్వకంగానో ఎక్కడైనవినో చదివో నవ్వుకొనే ఉంటారు. నవ్వురానివారికి మనమేమిచేప్పలేము అది manufacture defectఅని అనుకోవాలంతే. కాని జోకులు విని నవ్వుకున్న వారు, నవ్వంటే ఇష్టమున్న ప్రతి ఒకరు ఒక హాస్య బ్లాగ్ని క్రియేట్ చేస్తే, ఇంటర్నెట్ మొత్తం హాస్యబ్లాగులతో నిండిపోతుంది. అందుకే నాకో చిన్న ఆలోచన తట్టింది ధీన్ని పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
మీకు తెలిసిన జోకులతోపాటు, మీ బ్లాగ్ URL లేదా ఈమెయిల్ ఐడిని కామెంటు బాక్సులోరాయండి. దానికి తగిన animation జతచేసి మీ పేరు మరియు మీ బ్లాగ్ లంకేతో కొత్త టపాగా ప్రచురిస్తాను. మీకు నచ్చితే వెంటనే జోకు రాయడం ప్రారంభించండి.
ఇంటర్నెట్ సెంటేరుకేల్లి అప్పుడప్పుడు బ్లాగులు చూసే వారికోసమని టపాను రిపీట్ చేస్తాను. రోజు నెట్లో విహారించేవారు దయచేసి విసుక్కోకండి.

"నవ్వేజనా సుఖినోభవంతు"

3 చిరు నవ్వులు:

కొత్త పాళీ 9 నవం, 2009 5:30:00 PM  

మీ స్లోగను బాగుంది

రాంగోపాల్ 9 నవం, 2009 7:41:00 PM  

కొత్త పాళీ గారు,
నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి. కాని, ఒక జోకుని కూడా వ్రాసుంటే ఇంకా బాగుండేది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.