ప్రశాంతం
11, నవంబర్ 2012, ఆదివారం
"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge."చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.
"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.
జడ్జి: ఏమిటీ, మీవారిని ఆయన కోరికమీదే చంపారా? ఆశ్చర్యంగా అడిగాడు.
సూరమ్మ: ఇలా రోజూ కొంచెం కొంచెం చంపుకుతినే కంటే ఒకేసారి గొంతుపిసికి చంపరాదే అన్నారండీ వినయంగా చెప్పింది.


ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి కనిపించిన వారందరితో గొడవపడుతుంటే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు. ఆర్డర్.. ఆర్డర్... వచ్చిరావడంతోనే అన్నాడు జడ్జి. రొండు పెగ్గుల... విస్కీ, అందులోకి ఓ గ్లాసెడు షోడా, నంజుకోవడానికి చిప్సు వెంటనే చెప్పాడా తాగుబోతు బోనులోనే తూలుతూ.
విక్రం
కి ఓ హత్య కేసులో కోర్టు మరణశిక్ష విధించింది. అతడిని ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టారు.
పోలీస్ అధికారి: నీ చివరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగాడు.
విక్రం: నాకు భయంగా ఉంది. కాస్త నా చేయి పట్టుకుంటారా.

దొంగతనం నేరంకింద రమేశును కోర్టులో ప్రవేశపెట్టారు.తొమ్మిదినెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తిర్పుచేప్పాడు.
రమేశ్: ఇది దారుణం అని అరిచాడు.
న్యాయమూర్తి: ఈ బుద్ధి తప్పు చేసేముందు ఉండాలి ..
రమేశ్: అయినా ఒక్క కుడిచేయి చేసిన నేరానికి శరీరం మొత్తానికి శిక్ష వేయడం అన్యాయం కదా! పాయింటు లాగాడు.
న్యాయమూర్తి: చిన్నగా నవ్వి- సరే ....నువ్వు చెప్పినట్టే కానిద్దాం. నేను నీ కుడిచేతికి మాత్రమే శిక్ష వేస్తాను. శరీరాన్ని జైలుకు తెచ్చుకుంటావో లేదో నీ ఇష్టం అన్నాడు.
రమేశ్: చకచకా కృత్రిమ చేతిని ఊడదీసి అక్కడ పెట్టేసి భయటకు వెళ్ళిపోయాడు.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.