హాస్యాంజలికి స్వాగతం...
అన్నిరకాల హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అన్నిరకాల హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

అగ్ని ప్రమాదం

4, అక్టోబర్ 2012, గురువారం

ఒక పెద్ద భవనం మంటల్లో ఆహుతైపోతున్నది. అప్పారావు అటుగా వెళ్తున్నాడు.
"అయ్యో..... అయ్యో... భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటివెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు.
" కాలిపోయేది Fire Station నాయనా" బదులిచ్చాడో ఆసామి.

Read more...

1547 B.C.

29, ఆగస్టు 2012, బుధవారం


ఓ లారిడ్రైవర్, క్లీనర్ మ్యూజియం చూడడానికి వెళ్లారు. అక్కడో అస్థిపంజరం వేలడదిసి ఉంది. దాని కింద 1547 B.C. అని రాసి ఉంది. ఎంట్రోయ్ మొన్న లారి కిందపడి చచ్చిపోయినోడు ఈడేనా గుసగుసగా అన్నాడు డ్రైవర్. అవునవును..... లారినేంబరు కూడా రాశారు అని డ్రైవర్ను బయటకి లాక్కొచ్చాడు క్లీనర్.

Read more...

ఊ...కానీ

25, మే 2010, మంగళవారం

బరువు చూసుకునేందుకు వెయింగ్ మెషిన్ ఎక్కింది శిల్ప. రూపాయి నాణెం వేయగానే 50 కిలోలు అని చూపించింది.
తర్వాత తన హై హీల్స్ తీసేసి నాణెం వేసింది. ఈసారి 48 అని వచ్చింది.
స్వెట్టర్ తీసేసి మళ్ళి కాయిన్ వేసింది. ఈదఫా 46 వచ్చింది. చేతిలో చూసుకుంటే అప్పటికే రూపాయి బిళ్ళలు అయిపోయాయి.
బరువు చూసుకునేందుకు వచ్చి ఇదంతా చూస్తున్న శశికాంత్ ఆత్రుతగా అన్నాడు... కాయిన్స్ నేను వేస్తుంటానులెండి, మీరు కానివ్వండి, ఆపకండి...
అందుకు శిల్ప ఇలా అంది ముందు నినే వేస్తాను అని శశికాంత్ చెంపపై లాగి కొట్టింది.


Read more...

3 నవ్వులు

2, జనవరి 2010, శనివారం


ముచ్చటగా 3 సార్లునవ్వండి.

ప్రాసిక్యూటర్: ముద్దాయి ఎంతో తెలివిగా ఈ హత్యకు మాస్టర్‌ప్లాన్‌వేసి, చాకచక్యంగా పని పూర్తిచేశాడు.
ముద్దాయి: మీరు ఎంత పొగిడినా నేనీ నేరం ఒప్పుకోను.
తండ్రి: నీ వయసులో నాకు దేశ ప్రదానమంత్రులందరి పేర్లూ తెలుసు!
కొడుకు: అందులో గొప్పేముంది.. అప్పటికి ఇద్దరో ముగ్గురో ఉన్నట్టున్నారు.
టీచర్: సూరి దుస్తులకు నిప్పంటుకుంటే ఏం చేస్తావ్?
సూరి: వేసుకోను టీచర్.

Read more...

కుడి ఎడమైతే.....

7, డిసెంబర్ 2009, సోమవారం


చనిపోయి నరకానికి వెళ్ళాడు మాదవయ్య. ఏ శిక్ష కావాలో ఎంపిక చేసుకోమంటూ ఓ భటుడిని ఇచ్చి పంపాడు యముడు.
మాదవయ్య భటుడితో శిక్షలు అమలు జరిగే చోటుకి వెళ్ళాడు.
అక్కడ
ఓ పాపిని కొరడాతో కొడుతున్నారు. అది తన వల్ల కాదనుకున్నాడు.
కొంచెం
ముందుకేల్లాక ఒకతడిని మోకాళ్ల మీద నడిపిస్తున్నారు. అదీ ఇష్టం లేకపోయింది.
ఇంకాస్త ముందుకేల్లెసరికి అక్కడ ఒకతను పడుకొన్నాడు. అందమైన అమ్మాయి ఆయనకు ఒల్లుపడుతోంది.
మాదవయ్యకు
ప్రాణం లేచొచ్చింది. ఈ శిక్ష నాకు బాగుంది వెంటనే చెప్పాడు మాధవయ్య. అమ్మాయి.. ఇక నువ్వు వేల్లోచ్చు ఆజ్ఞాపించాడు భటుడు.
పాపం మాధవయ్య శిక్ష పడుకొన్నావాడికి కాదు ఆ అమ్మయికని తెలియక ఇరుక్కుపోయాడు

Read more...

కుక్కకాటుకు... చెప్పు దెబ్బ

3, డిసెంబర్ 2009, గురువారం



ఓ దేశపు చక్రవర్తి తన రాజ్యమంతటా పర్యటిస్తున్నాడు. ఓ గ్రామంలో అచ్చు తన పోలికలతో ఉన్న వ్యక్తి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు.
రాజు:
(దర్పంగా) ఏమయ్యా..... మా రాజమహల్లో మీ తల్లిగాని ఎప్పుడైనా పనిచేసిందా? అని ప్రశ్నించాడు.
రాజుగారి ప్రశ్నకు తొలుత తత్తరపడినా, అందులోని భావాన్ని గ్రహించిన ఆ సామాన్యుడు ఇలా సమాధానమిచ్చాడు.
సామాన్యుడు: ప్రభూ
! అంతఃపురంలో నా తల్లి పనిచేయ లేదుకాని, మా నాన మాత్రం కొంతకాలం పనిచేసినట్లు గుర్తు.

Read more...

అసలు పేరేమిటి?

10, నవంబర్ 2009, మంగళవారం


బబ్బులు కారు గోతిలో చిక్కుకుంది.
దగ్గరలోని
గుర్రలశాల నుంచి ఓ గుడ్డిగుర్రాన్ని తీసుకొచ్చి కారుకు కట్టాడు అక్కడి వ్యక్తి. కమాన్.... లోటస్.. ఊఁ.... లాగెయ్ రిక్కీ.... నువ్వు కూడా....
డార్కి.... ఊపిరి బిగబట్టి ఒక్క ఊపులో హుపుమంటూ లాగాలి
గుర్రం ఒక్క ఉదుటున లాగగానే కారు బయటకు వచ్చేసింది.
థాంక్స్ ఒక్క గుర్రానే అన్నీ పేర్లతో పిలిచారు. ఇంతకీ దాని అసలు పేరేమిటి? అని అడిగాడు బబ్బులు.
దాని పేరు లోటసే. మిగతావన్నీ దాని తోటి గుర్రాలు. ఇది గుడ్డిదైనా భలే తెలివైనది. పనైనా తానొక్కతే ఎందుకు చెయ్యాలని తెగ పంతం దానికి చెప్పాడా వ్యక్తి.

Read more...

చురక

31, అక్టోబర్ 2009, శనివారం



బస్సులో రద్ది ఎక్కువగా ఉంది. కాళ్ళు పెట్టడం కుడా కష్టంగా ఉన్నా ఏదోలా చొరపడ్డాడు రంగన్న చి..చి... దేశంలో ఉన్న జంతువులన్నీ యిక్కడోచ్చి చేరాయి. అని గొణిగాడు.
ఒక్క గాడిద తప్ప అన్ని ఉన్నాయనుకున్నాం మీ రాకతో లోటు కూడా తీరింది అని చురకేశాడో ప్రయాణికుడు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.