హాస్యాంజలికి స్వాగతం...

వెంట్రుక చెప్పిన నిజం

30, డిసెంబర్ 2012, ఆదివారం


"ఇవాళ వంట అమ్మా చేసిందా నాన్న?" అడిగాడు హైటెక్ కొడుకు.
"ఎలా కనుక్కున్నావురా?" అడిగాడు తండ్రి.
"పిజ్జాలో పొడవాటి వెంట్రుక వచ్చింది. మీది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు

Read more...

అబ్బో... దగ్గు

23, డిసెంబర్ 2012, ఆదివారం

రాఘవయ్య అర్దరాత్రి లేచి కుర్చిలొ కుర్చోని విపరీతంగా దగ్గుతున్నాడు.
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."

Read more...

కాకి తెలివి

16, డిసెంబర్ 2012, ఆదివారం

"వెధవా.. దున్నపోతా... నెత్తిమీదకు పదేళ్ళు వచ్చాయి. చెల్లెలికి biscuit చిన్న ముక్క ఇచ్చి పెద్దది నువ్వు తింటూ దాన్నేడిపిస్తున్నావా?  కాకి చూడు, ఆహారం తెచ్చి ముందు పిల్లలకిచ్చి తరువాత తాను తింటుంది" టింకూను మందలిస్తూ..  biscuit లాక్కున్నాడు సతీష్.

"కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.

Read more...

ఆటగాడు

9, డిసెంబర్ 2012, ఆదివారం

"మంచి ఆటగాడు అని చెపితే ఏదో పెద్ద player అని పెళ్ళి ఛెశుకున్నా. తీరా చేసుకున్న తరువాత తెలిసింది" విచారంగా అంది సుమలత.
"ఏమైంది? మరి ఆటగాడు కాదా అతను" అడిగింది శ్రీదేవి.
"ఆటగాడే.... తోలుబొమ్మల్ని ఆడిస్తుంటాడటా పల్లెటూర్లలో.." ఏడ్చింది సుమలత.

Read more...

చూస్తూ...

2, డిసెంబర్ 2012, ఆదివారం

"సిగ్గులేని వెధవా! ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...."
కొడుకిని చేతులతో పైకెత్తి కేకలేస్తున్నాడు కోదండం.

"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. అనూరాధనుచూసి చూసే గతి పట్టాను" చెప్పాడు కొడుకు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.