హాస్యాంజలికి స్వాగతం...

అడ్డుగా నిచ్చెన

20, ఫిబ్రవరి 2010, శనివారం

పింకీ: అమ్మా, హాల్లో అడ్డంగా నిచ్చెన ఎవరు పెట్టారు? అది నా మీద పడింది.
అమ్మా: నేను వంట చేస్తున్నా, అక్కడే మీ నాన్న ఫ్యాన్‌ బాగుచేస్తుంటారు చూడు. దెబ్బలేమయిన తగిలితే మందు రాయించుకో!
పింకీ: ఎంత పిలిచినా ఫ్యాన్‌ రెక్కలు పట్టుకొని వేలాడుతున్నారే గానీ వాటిని వదిలి దిగడం లేదు. నువ్వే రా!

Read more...

ఈ ప్రశ్న క్యాన్సిల్...

17, ఫిబ్రవరి 2010, బుధవారం

గొపి: ఓరేయ్‌ రాజూ, నీ దగ్గర రెండు సెల్‌పోన్లు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా?
రాజు: అదేంట్రా అలా అడుగుతున్నావు. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటీ!
గొపి: నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా?
రాజు: ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండడానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను
గొపి: నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా?
రాజు: ఏరా నీకింకా నమ్మకం కలగలేదా.
గొపి: రెండు కలర్‌ టీవీలుంటే....
రాజు: నా దగ్గర రెండు కలర్టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావు... ప్రశ్న క్యాన్సిల్.

Read more...

బిల్లు మోగింది

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఫోన్‌ బిల్‌ చూసి బిత్తరపోయిన రామరాజు ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరు ఇన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు.
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌ గారి అకౌంట్లోనే!
పనిమనిషి: మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేసుకుంటున్నారు కదాని నేను ఈ ఫోన్‌ వాడుతున్నాను.
మరి నాకు ఆఫీస్అంటే మీ ఇల్లే కదా!

Read more...

రహస్య కెమెరాలు

15, ఫిబ్రవరి 2010, సోమవారం


టీవీ చూస్తున్న రఘురాం ఉన్నట్లుండి గదిలో మూలమూలా వెతుకుతున్నాడు.
ఎందుకు వెతుకుతున్నారు అని భార్య అడిగింది.
రహస్య కెమెరాల్ని అన్నాడు రఘురాం.
ఏంటీ ? అంది తన భార్య.
నేను హాస్యాంజలి చానల్‌ చూస్తున్నానా. ఇందాకటి నుంచీ మీరు చూస్తున్నది హాస్యాంజలి చానల్‌ అని ఆ
యాంకర్‌ నా వంక చూస్తూ చెబుతోంది నేనేం చూస్తున్నానో ఆమెకెలా తెలుస్తుంది. తప్పకుండా
ఇక్కడెక్కడో రహస్య కెమెరాలు ఉండే ఉంటాయ్‌ వెతుకుతూనే చెప్పాడు రఘురాం.

Read more...

ఎత్తుకు పై ఎత్తు

14, ఫిబ్రవరి 2010, ఆదివారం


పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ స్థితిని అంచనా వేసేందుకు టీవీ రూమ్‌కి తీసుకెళ్లారు.
హాయ్‌ చిరంజీవి...అన్నాడు టీవీలో వస్తోన్న చిరంజీవి పాటను చూసి.
వైద్యుల ముఖంలో ఆనందం.
తరవాత, అప్పుడే రంగువేసి ఉంచిన బల్లపై పేషేంట్‌ను కూర్చోమన్నారు. అతడు అటూ ఇటూ చూస్తూ దీనిపై ఓ పేపర్ వేస్తారా అని అడిగాడు.
వైద్యుల్లో మరోసారి ఆనందం.
ఎందుకూ పేపర్ వెయ్యడం? డాక్టర్లలో ఒకరు ఉత్సాహంగా అడిగారు.
ఎత్తులో కూర్చుంటే టీవీ బాగా కనిపిస్తుంది. సమాధానమిచ్చాడా పేషెంట్.

Read more...

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

Read more...

మహాశివరాత్రి శుభాకాంక్షలు

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

Read more...

నిజమా... తాగానా

11, ఫిబ్రవరి 2010, గురువారం


రాత్రి రెండింటికి రోడ్డు పక్క మురికి గుంటలో పడున్నాడు వెంకటేశం.
అటుగా వెళ్తున్న ఓ పోలీసు అధికారి జీపు ఆపి వచ్చి బయటకు లాగుతూ ఇంటికి వెళ్ళవా... ఎంత తాగావేంటీ ఒకటే వాసన అన్నాడు.
సర్‌ నేను తాగానా సందేహంగా అడిగాడు వెంకటేశం.
నువ్వు కాకపోతే నేను తాగానా కోపంగా అన్నాడు పోలీసు.
అమ్మయ్య, అయితే నేను తాగానన్నమాట. ఇంకా నయం, లేవలేకపోతుంటే కాళ్లకేమయిందోనని
అంబులెన్స్‌కి ఫోన్‌ చేద్దామనుకుంటున్నా... తాపీగా చెప్పాడు వెంకటేశం.

Read more...

ఏమరపాటు

6, ఫిబ్రవరి 2010, శనివారం

ప్రకాశరావు సీరియస్‌గా పేపర్‌లో మునిగిపోయాడు. కాసేపు చదివి ఇంకో కప్పు కాఫీ అని గట్టిగా కేకేశాడు.
ఆయన భార్య కిచెన్‌లోచి ఏంటీ ఈరోజు ఆఫీసుకు వెళ్లేపనిలేదా అంది.
అరే... నేను ఇంకా ఆఫీసులో ఉన్నాననుకుంటున్నాను హడావుడిగా లేస్తూ చెప్పాడు ఆ ఉద్యోగి.

Read more...

ముందు జాగ్రత్త

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

పరమ గయ్యాళిగా పేరుపడిన శామ్యూల్ రాజు భార్య చనిపోయిందని శవపేటికలో తీసుకెళ్తున్నారు.
శ్మశానానికి చేరుకునేంతలో శవపేటిక మూత ఊడింది. దాన్నీ బిగించబోతుండగా చిన్నగా శ్వాస తీసుకుంటున్న శబ్దం వినబడింది. తీరా చూస్తే ఆవిడ కొన ఊపిరితో ఉంది.
పొరపాటు గ్రహించి ఆమెను మళ్ళి వెనక్కి తెచ్చారు. ఆ తర్వాత ఆవిడ ఓ పదేళ్ళు బతికి, ఓరోజున కాలం చేసింది. మళ్ళి ఆమె శవాన్ని శవపేటికలోకి ఛేరుస్తున్నారు. గొంతు సవరించుకుని పనివాళ్ళతో శామ్యూల్ రాజు అన్నాడు... ’ తలుపు చెక్కలు కాస్త గట్టగా బిగించండి.

Read more...

మీలా కాదు

3, ఫిబ్రవరి 2010, బుధవారం

ఇద్దరు న్యాయవాదులు ఓ ఊరికి వెళ్లారు. అక్కడ నూనె తీసే గానుగ కనబడింది. యజమాని లేకపోయినా ఎద్దు ఒకే వేగంతో చుట్టూ తిరుగుతుంది.
పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి చూస్తే ఒకాయన చద్దన్నం తింటున్నాడు.
పెద్దాయనా..... అక్కడ ఎద్దును వదిలేసి, ఇక్కడ భోంచేస్తున్నావా? అడిగాడు ఓలాయర్.
అది నడక ఆపితే నాకు తెలుస్తుందిలే నములుతూనే జవాబిచ్చాడు ముసలయ్య.
ఎలా? అని ప్రశ్నించాడు లాయర్.
దాని మెడలో కట్టిన గంట చప్పుడు ఆగిపోతుంది.
ఒకవేళ అది అక్కడే నిలుచుని మెడను అటూ ఇటూ ఊపినా గంట శబ్దం వస్తుందిగా సందేహం వ్వక్తంచేశాడు మరో లాయర్.
అది వకీల్ కాదుగా బాబూ.... కేసును అక్కడే ఉంచి కదిపినట్టు నటించడానికి చురకేశాడు పెద్దాయన.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.