హాస్యాంజలికి స్వాగతం...
కుటుంబంలో హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కుటుంబంలో హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

లాంఛనాలు

2, ఏప్రిల్ 2013, మంగళవారం

"అల్లుడుగారూ.. కట్నం విషయం కుదిరింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. Scooter, Colour TV, ఇవ్వాలనుకుంటున్నాం ఏవంటారు?" కాబోయే అల్లుడిని అదిగాడు రామనాధం.

"ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక Washing machine,Mixer  ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడుముందుచూపుతోనారాయణ.

Read more...

అరుపు

1, ఏప్రిల్ 2013, సోమవారం


"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

Read more...

ఈజిప్ట్ మమ్మీ

6, జనవరి 2013, ఆదివారం

కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"

"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.

"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"

Read more...

వెంట్రుక చెప్పిన నిజం

30, డిసెంబర్ 2012, ఆదివారం


"ఇవాళ వంట అమ్మా చేసిందా నాన్న?" అడిగాడు హైటెక్ కొడుకు.
"ఎలా కనుక్కున్నావురా?" అడిగాడు తండ్రి.
"పిజ్జాలో పొడవాటి వెంట్రుక వచ్చింది. మీది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు

Read more...

అబ్బో... దగ్గు

23, డిసెంబర్ 2012, ఆదివారం

రాఘవయ్య అర్దరాత్రి లేచి కుర్చిలొ కుర్చోని విపరీతంగా దగ్గుతున్నాడు.
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."

Read more...

కాకి తెలివి

16, డిసెంబర్ 2012, ఆదివారం

"వెధవా.. దున్నపోతా... నెత్తిమీదకు పదేళ్ళు వచ్చాయి. చెల్లెలికి biscuit చిన్న ముక్క ఇచ్చి పెద్దది నువ్వు తింటూ దాన్నేడిపిస్తున్నావా?  కాకి చూడు, ఆహారం తెచ్చి ముందు పిల్లలకిచ్చి తరువాత తాను తింటుంది" టింకూను మందలిస్తూ..  biscuit లాక్కున్నాడు సతీష్.

"కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.

Read more...

చూస్తూ...

2, డిసెంబర్ 2012, ఆదివారం

"సిగ్గులేని వెధవా! ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...."
కొడుకిని చేతులతో పైకెత్తి కేకలేస్తున్నాడు కోదండం.

"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. అనూరాధనుచూసి చూసే గతి పట్టాను" చెప్పాడు కొడుకు.

Read more...

అడ్డుగా నిచ్చెన

20, ఫిబ్రవరి 2010, శనివారం

పింకీ: అమ్మా, హాల్లో అడ్డంగా నిచ్చెన ఎవరు పెట్టారు? అది నా మీద పడింది.
అమ్మా: నేను వంట చేస్తున్నా, అక్కడే మీ నాన్న ఫ్యాన్‌ బాగుచేస్తుంటారు చూడు. దెబ్బలేమయిన తగిలితే మందు రాయించుకో!
పింకీ: ఎంత పిలిచినా ఫ్యాన్‌ రెక్కలు పట్టుకొని వేలాడుతున్నారే గానీ వాటిని వదిలి దిగడం లేదు. నువ్వే రా!

Read more...

బిల్లు మోగింది

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఫోన్‌ బిల్‌ చూసి బిత్తరపోయిన రామరాజు ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరు ఇన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు.
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌ గారి అకౌంట్లోనే!
పనిమనిషి: మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేసుకుంటున్నారు కదాని నేను ఈ ఫోన్‌ వాడుతున్నాను.
మరి నాకు ఆఫీస్అంటే మీ ఇల్లే కదా!

Read more...

ఆయన ఘనతే

11, జనవరి 2010, సోమవారం


రామనాధం సర్వీసు పూర్తికాకుండా చనిపోయాడు. గ్రాట్యుటీ, పీఎప్‌, ఇన్స్యూరెన్స్‌లతోపాటు భార్యకు అదే డిపార్ట్‌మెంట్లో ఉద్యోగము వచ్చింది.
వచ్చిన డబ్బుతో రామనాధం భార్య, ఓ మంచి ఇల్లు, టీవీ, ఫ్రీజ్, సోఫాలు అన్నీ కొన్నది. పిల్లలకు స్కూటి, సైకిళ్లు కొనిచ్చింది.
అమ్మా ఇవన్నీ ఎలా వచ్చాయి? అని పిల్లలు అడిగితే.... ఇందులో నా గొప్పేమీ లేదు బాబు. అంతా మీ నాన్నగారి చలవ. ఆయన పోకుండా ఉండి ఉంటే మనమింకా ఆ దరిద్రంలోనే ఉండేవాళ్లం చెప్పిందా ఇల్లాలు.

Read more...

సోమ,మంగళ,బుద.......

24, డిసెంబర్ 2009, గురువారం


పనిపిల్లను తిడుతోంది గృహిణి.
ఇదుగో
ఇవ్వాళ సోమవారం మధ్యాహ్నం. కళ్లు మూసి తెరిచేలోపు మంగళవారం వస్తుంది, ఇక బుధవారం రావడం ఎంతసేపు? వారంలో సగం రోజులు అయిపోయినాయి...... ఎక్కడి పని అక్కడే ఉంది, త్వరగా కానియ్ మొద్దుమొహమా.

Read more...

రెండో ఏడాదో?

17, డిసెంబర్ 2009, గురువారం


నాకేం దిగులండి. రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలు. ఒక్కొక్కరి దగ్గరా నాలుగు నేలలున్నా ఏడాది గడిచిపోతుంది. అని శివయ్యతో కబ్బుర్లు చెబుతున్నాడు ఈ మధ్యే రిటైడ్ అయినా పరంధామయ్య.
మరి రెండో ఏడాది నుంచి ఎక్కడుంటావ్ తాతయ్యా? ఆరా తిస్తున్నట్లు అడిగాడు అక్కడే ఆడుకుంటున్న మనవడు.

Read more...

ప్రతిబింబం

14, నవంబర్ 2009, శనివారం


అద్దం కొత్తగా వచ్చిన రోజులు. పోలంనుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దంముక్క దొరికింది. అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు. చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు. ఆ అద్దం ముక్కను ఇంట్లో ఓచోట దాచిపెట్టి రోజు ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతుండేవాడు.
సుబ్బయ్య
ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది. ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తిసిచూస్తే ఏముంది? అందులో 30 ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది. అంతే! భర్తకు ఎవరితోనో సంబంధముందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మను పిలిచి- ఆయనేలాంటి పనిచేశారో చూడు అని కన్నీరు పెట్టుకుంది.
ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని- ఏయ్ పిచ్చిమొహమా.... ఇంత ముసలావిడతో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే.... ఎవరైనా వింటే నవ్విపోతారు అంది.

Read more...

పరమార్థం

21, అక్టోబర్ 2009, బుధవారం

రామారావు పేకాటలో నిండా మునిగిపోయాడు. రాత్రిలేదు పగలు లేదు... భార్యాపిల్లల పట్టింపు లేదు. పరిస్థితి చేయిదాటిందని వాళ్ళావిడ తన సోదరుడికి కబురు పెట్టి పిలిపించింది.
బావమరిది: చూడు భావా.... పేకాటలో డబ్బులు ఇవ్వాల వస్తాయి. రేపు పోతాయి ఎల్లుండి వస్తే, అవతలెల్లుండి మళ్లీ పోతాయి. ఇది మాయదారి ఆట.... అని తన బావ రామారావుకు నెమ్మదిగా చెబుతున్నాడు.
రామారావు: సర్లే యింతకి నువ్వు చెప్పేదేమిటి.... రోజు విడిచి రోజు ఆడమంటావు....అంతేగా!

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.