హాస్యాంజలికి స్వాగతం...

ప్రతిబింబం

14, నవంబర్ 2009, శనివారం


అద్దం కొత్తగా వచ్చిన రోజులు. పోలంనుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దంముక్క దొరికింది. అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు. చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు. ఆ అద్దం ముక్కను ఇంట్లో ఓచోట దాచిపెట్టి రోజు ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతుండేవాడు.
సుబ్బయ్య
ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది. ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తిసిచూస్తే ఏముంది? అందులో 30 ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది. అంతే! భర్తకు ఎవరితోనో సంబంధముందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మను పిలిచి- ఆయనేలాంటి పనిచేశారో చూడు అని కన్నీరు పెట్టుకుంది.
ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని- ఏయ్ పిచ్చిమొహమా.... ఇంత ముసలావిడతో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే.... ఎవరైనా వింటే నవ్విపోతారు అంది.

4 చిరు నవ్వులు:

హను 14 నవం, 2009 2:47:00 PM  

nice one, sir bagumdi useing bagumdi, aalocana bagumdi

రాంగోపాల్ 14 నవం, 2009 10:45:00 PM  

hanu గారు,
నా టపాపై మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

అజ్ఞాత,  15 నవం, 2009 2:50:00 PM  

:) రాంగోపాల్ గారు బాగుంది. మీ పేరులోనే ఇద్దరు ఉన్నారు గమనించారా. ముందు రాముడు తరవాత గోపాలుడా ?

రాంగోపాల్ 15 నవం, 2009 6:06:00 PM  

rama108 గారు,
ఔనండి, నా పేరులో ఇద్దరు యుగపురుషులున్నారు. రాముడిగా రాంగోపాల్స్ బ్లాగులో(http://ramgopal-s.blogspot.com) చాలా మంచివిషయాలు వ్రాస్తున్నాను, గోపాలుడిగా ఈ నవ్వుల(హాస్యాంజలి)బ్లాగు వ్రాస్తున్నాను. ఎందుకంటే, గోపాలుడు అల్లరివాడు, తుంటరివాడు నవ్వుతూ నవ్విస్తాడు కదండి......

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.