హాస్యాంజలికి స్వాగతం...

పంచావతారం

30, నవంబర్ 2009, సోమవారం


నగేష్ చెకప్ కోసం వెటర్నరి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
డాక్టర్: చూ
డు మిస్టర్.... మీరు వెళ్లాల్సింది నా ఎదురుగ్గా ఉన్న క్లినిక్కు సూచించాడు.
నగేష్: లేదు డాక్టర్.... నేను మీ కోసమే వచ్చాను.
డాక్టర్: ఇదిగో.... నువ్వు నాలా మాట్లాతున్నావు. నీ బాధేంటో చెప్పుకోగలుగుతున్నావు. అంటే నువ్వు మనిషివి. కానీ నేను పశువులకు వైద్యం చేసే డాక్టర్నే.
నగేష్: విషయం తెలిసే వచ్చాను
డాక్టర్: ఎందుకనీ?
నగేష్: ఎందుకంటే... పొద్దున్నే గుర్రంలాగా పరుగెత్తుకుని ఆఫీసుకు వెళ్ళాను. రోజంతా గాడిదలా పనిచేస్తాను. బాస్ పిలిచినప్పుడల్లా కుక్కలా తోక ఊపుతాను. రాత్రి ఇంటికి వచ్చి నా భార్యను చూడగానే పిల్లినైపోతాను......

4 చిరు నవ్వులు:

రాంగోపాల్ 1 డిసెం, 2009 7:53:00 AM  

చిలమకూరు విజయమోహన్ గారు,
ఈ హాస్యాం మీకు నవ్వుపుట్టించినందుకు నాకు సంతోషంగా ఉందండి. కాని, మీరు :D
(symbols)తొ కాకుండా మన తెలుగు భాషలొ వ్రాసి వుంటే తెలుగుభాషాభిమానిగా ఇంకా ఎక్కువ సంతోషించేవాడిని. దయచేసి ఇకమీదట మన తెలుగులోనే వ్రాయండి.

మాలా కుమార్ 1 డిసెం, 2009 6:54:00 PM  

పాపం నగేష్ . బాగుంది .

రాంగోపాల్ 3 డిసెం, 2009 6:58:00 PM  

మాలా కుమార్ గారు,
మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.