హాస్యాంజలికి స్వాగతం...

ఎండలో ఆరబెట్టాను....

28, నవంబర్ 2009, శనివారం


పిచ్చాసుపత్రి పరిసరాల్లో ఉన్న బావిలో ఓ రోగి పడిపోయాడు. వెంటనే మరో రోగి జలందర్ అందులోకి దూకి అతడిని కాపాడాడు. ఈ విషయం అక్కడి డాక్టర్ కి తెలిసింది.
డాక్టర్: జలందర్ మనిషి నీళ్ళలో మునిగిపోతుంటే ధైర్యంగా దూకి కాపాడావంటే నీకు పిచ్చీ లేదన్నమాటే. నిన్ను వెంటనే డిశ్చార్జ్ చేసే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.
జలందర్: చాలా సంతోషం డాక్టర్.
డాక్టర్: ఇంతకి నువ్వు కాపాడిన ఆ రోగి ఎక్కడ?
జలందర్: అదా.... నీళ్లల్లో బాగా నానిపోయాడు కదా డాక్టర్.... అందుకని ఎండలో ఆరబెట్టాను గర్వంగా చెప్పాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.