హాస్యాంజలికి స్వాగతం...

నా సొమ్ముతో సదివించుకుంటున్నారన్నమాట....

29, నవంబర్ 2009, ఆదివారం


చౌరస్తాలొ ఉండే బిచ్చగాడికి రోజూ పది రూపాయలు ఇవ్వటం సూరి అలవాటు. ఉన్నట్టుండి ఒకరోజు నుంచీ ఏడున్నర రూపాయలే వేయడం మొదలు పెట్టాడు.
అలా రెండేళ్ళు గడిచాక ఒకనాడు ఐదు రూపాయలే ఇచ్చాడు.
బిచ్చగాడు: ఉండబట్టలేక సామీ... మొదట్లో పది రూపాయలు ఏసినారు గందా! మద్దిలో ఏడున్నరే యేశారు. ఇప్పుడదీ తగ్గించి ఐదు రూపాయలే ఇస్తున్నారేంది! కనికరించండి బాబయ్యా అన్నాడు.
సూరి: మొదట్లో నా పెద్దకొడుకు కాలేజీ చదువులకు వచ్చాడు. ఖర్చులన్నీ తగ్గించాను. అందుకే నీకూ రెండున్నర తగ్గించాను.ఆ తర్వాత నా రెండో కొడుకూ పై చదువులకొచ్చాడు....
బిచ్చగాడు: ఐతే నా సొమ్ముతో మీ కొడుకుల్ని సదివించుకుంటున్నారన్నమాట కానియ్యండి బాబయ్యా ఏం సేత్తాం మద్యలో కలగజేసుకొని నిట్టూర్చాడు.

2 చిరు నవ్వులు:

మాలా కుమార్ 29 నవం, 2009 5:38:00 PM  

మీ హాస్యాంజలి చాలా బాగుందండి . నేను నిన్ననే చూసాను . మా పిల్లలకి చూపించాను . వాళ్ళు నన్ను ఇక్కడి నుండి కదలనీయటము లేదు .ఆ పడి పోతున్న వాడిని చూస్తూ , పడీ పడీ తెగనవ్వేస్తున్నారు .

రాంగోపాల్ 29 నవం, 2009 6:32:00 PM  

మాలా కుమార్ గారు,
మీకు మరియు మీ పిల్లలకు హాస్యాంజలి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.