హాస్యాంజలికి స్వాగతం...
ఆఫిస్‌లో హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆఫిస్‌లో హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

అర్జెంట్‌

18, ఆగస్టు 2012, శనివారం

తొందరగా రొండో అంతస్తుకి వెళ్లి ఆ పైల్‌ తీసుకురా బాయ్‌తో అన్నాడు పదో అంతస్తులో మీటింగ్‌లో ఉన్న రమేష్‌.
అర్ధ గంట తరువాత అలసిపోయి వచ్చాడు బాయ్‌.
అర్జెంట్‌గా రమ్మంటే ఇంత ఆలస్యమా... ఏం జరిగింది అని అడిగాడు రమేష్‌.
తొందరగానే లిప్ట్‌ దగ్గరికి వెళ్లాను సార్‌. కానీ లిప్ట్‌లో ఎమర్జెన్సీలో పక్కనున్న నిచ్చెనను
ఉపయెగించండి అని రాసుంది. అందుకే......

Read more...

వంట చెయ్యాలి

4, జనవరి 2010, సోమవారం


ఆఫిసర్: ఏమొయ్ చంద్రం, రాత్రి ఎనిమిదవుతోంది... ఇంకా పనిచేస్తున్నావు. అసలే కొత్తగా పెళ్ళైనవాడివి. పనెక్కువగా ఉంటే రేపు చేసుకొవచ్చులే.ఇక ఇంటికెళ్ళు అని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు.
చంద్రం: అది కాదు సార్‌. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ఇంటికి ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళు వంట చేయాలి. అందుకే.... నసిగాడు చంద్రం.

Read more...

చేతకాదూ

31, డిసెంబర్ 2009, గురువారం

సేల్స్ మెన్ కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది.
అధీకారి: మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా?
శ్రీకాంత్: లేరు.
అధీకారి: ఇప్పటివరకూ మీరు ఎవరినైనా ప్రేమించారా లేదాఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా?
శ్రీకాంత్: అబ్బే లేదండీ.
అధీకారి: అంటే, ముందు ఉద్యోగం తెచ్చుకుని తరవాత ప్రేమించాలనుకుంటున్నారా?
శ్రీకాంత్: నాకు కెరియరే ముఖ్యం. తరవాతే ప్రేమాగీమా. అయినా అమ్మాయిల వెనక తిరగడం, కబుర్లు చెప్పడం... ఇవన్ని నాకు చేతకాదులెండి.
అధీకారి: సారీ, మీకీ ఉద్యోగం ఇవ్వడం మాకు చేతకాదూ. ఎందుకంటే కమ్యూనికెషన్ స్కిల్స్ లేవు. మీమీద మీకు నమ్మకం కూడా లేదు. ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడాప్రేమలో పడేయలేనివాళ్లు మా ఉత్పత్తుల్ని ఎలా అమ్ముతారు? you can go.

Read more...

తప్పు తప్పే

21, డిసెంబర్ 2009, సోమవారం


పాపం ఉద్యోగిని మాత్రం బాస్ మినహాయించడు ఎందుకు?

బార్బర్ తప్పు చెస్తే… న్యూస్టైల్ అవుతుంది.
డ్రైవర్ తప్పు చెస్తే… కొత్తదారి దొరుకుతుంది.
తల్లిదండ్రులు తప్పు చేస్తే… కొత్త తరం పుడుతుంది.
సైంటిస్టు తప్పు చేస్తే… కొత్త ఆవిష్కరణ పుడుతుంది.
రాజకీయ నాయకుడు తప్పు చేస్తే… కొత్త చట్టమవుతుంది.
టైలర్ తప్పు చేస్తే… కొత్త డిజైన్ రూపొందుతుంది.
టీచర్ తప్పు చేస్తే… కొత్త పాఠమవుతుంది.
బాస్ తప్పు చేస్తే… కొత్త ఐడియాగా మారుతుంది.
ఉద్యోగి తప్పు చేస్తే….. అది తప్పే అవుతుంది.

ఇది సరదాకి మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు.

Read more...

అవును.... అతనే

29, అక్టోబర్ 2009, గురువారం

బాస్: డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలని నిన్న సెలవు పెట్టినట్టున్నావు కదూ!
సెక్రెటరి: అవును సార్!
బాస్: మరైతే ఎవరితోనో సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తు కనిపించావ్!
సెక్రెటరి: అవును సార్.... అతనే మా డెంటిస్ట్.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.