నిద్ర
25, నవంబర్ 2012, ఆదివారం
"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అన్నాడు సూరిబాబు."ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పింది Doctor.
"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అన్నాడు సూరిబాబు.
"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.
"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.
కిశోర్: పెళ్ళ
యిన కొత్తలో ఇంట్లోకెళ్ళి బూట్లు విప్పుతూ ఉండగానే నా భార్య ప్రేమతో కాఫీ పట్టుకోచ్చేది. అప్పట్లో వాళ్ల కుక్క మాత్రం నన్ను చూడగానే అరుస్తూ ఉందేది. కాని ఇప్పుడంతా రివర్స్. ఆ కుక్క కాఫీ పట్టుకొస్తే ఆమె అరుస్తోందని సైకాలజిస్టుతో కష్టాలు చెప్పుకుంటున్నాడు .
సైకాలజిస్టు: చేసేవాళ్ళు మారినా అప్పుడూ ఇప్పుడూ మీకు చేసే సేవల్లో తేడా లేదు కదా. మరి సమస్యేమిటి? అడిగాడు.

పిచ్చాసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ స్థితిని అంచనా వేసేందుకు టీవీ రూమ్‌కి తీసుకెళ్లారు.
హాయ్ చిరంజీవి...అన్నాడు టీవీలో వస్తోన్న చిరంజీవి పాటను చూసి.
వైద్యుల ముఖంలో ఆనందం.
తరవాత, అప్పుడే రంగువేసి ఉంచిన బల్లపై పేషేంట్‌ను కూర్చోమన్నారు. అతడు అటూ ఇటూ చూస్తూ దీనిపై ఓ పేపర్ వేస్తారా అని అడిగాడు.
వైద్యుల్లో మరోసారి ఆనందం.
ఎందుకూ పేపర్ వెయ్యడం? డాక్టర్లలో ఒకరు ఉత్సాహంగా అడిగారు.
ఎత్తులో కూర్చుంటే టీవీ బాగా కనిపిస్తుంది. సమాధానమిచ్చాడా పేషెంట్.

డాక్టర్: కృష్ణారావు...... నీ ఆరోగ్యం బాగుపడాలంటే నేను చెప్పే రెండింటిలో ఒకదాన్నైనా విడిచిపెట్టాలి?
కృష్ణారావు: ఏంటవి డాక్టర్?
డాక్టర్: మద్యం ముట్టకూడదు లేదా మగువల జోలికి పోకూడదు.
కృష్ణారావు: అయితే ఈ రోజు నుంచి మందు తాగను డాక్టర్.
డాక్టర్: దీన్నే విడిచిపెట్టడానికి ప్రాత్యేక కారణం ఏమైనా ఉందా?
కృష్ణారావు: నేను ముసలివాడినయ్యాక కూడా మందు తాగొచ్చు డాక్టర్... రెండోది అలా కాదుగా.

సుహాని: డాక్టర్ గారు ఉదయం ఇంట్లో చిన్న గోడవైంది. మా వారు నిధ్రమాత్రలనుకొని ఓ ముప్పై ఒళ్ళు నొప్పుల మాత్రల్ని ఒకేసారి మింగేశారు. ఏమన్నా అవుతుందంటారా ఫోనులో అడిగింది.
డాక్టర్: ఏంటి ఒల్లునోప్పుల మాత్రలు మింగాడా? అయితే ఓ పనిచేయండి ఒళ్ళంతా పచ్చిపుండయ్యేలా విరగోట్టండి. అన్ని మాత్రలకు ఆ మాత్రం నొప్పులు అవసరం సమాధానమిచ్చారు.

నగేష్ చెకప్ కోసం వెటర్నరి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
డాక్టర్: చూడు మిస్టర్.... మీరు వెళ్లాల్సింది నా ఎదురుగ్గా ఉన్న క్లినిక్కు సూచించాడు.
నగేష్: లేదు డాక్టర్.... నేను మీ కోసమే వచ్చాను.
డాక్టర్: ఇదిగో.... నువ్వు నాలా మాట్లాతున్నావు. నీ బాధేంటో చెప్పుకోగలుగుతున్నావు. అంటే నువ్వు మనిషివి. కానీ నేను పశువులకు వైద్యం చేసే డాక్టర్నే.
నగేష్: ఆ విషయం తెలిసే వచ్చాను
డాక్టర్: ఎందుకనీ?
నగేష్: ఎందుకంటే... పొద్దున్నే గుర్రంలాగా పరుగెత్తుకుని ఆఫీసుకు వెళ్ళాను. రోజంతా గాడిదలా పనిచేస్తాను. బాస్ పిలిచినప్పుడల్లా కుక్కలా తోక ఊపుతాను. రాత్రి ఇంటికి వచ్చి నా భార్యను చూడగానే పిల్లినైపోతాను......

పిచ్చాసుపత్రి పరిసరాల్లో ఉన్న బావిలో ఓ రోగి పడిపోయాడు. వెంటనే మరో రోగి జలందర్ అందులోకి దూకి అతడిని కాపాడాడు. ఈ విషయం అక్కడి డాక్టర్ కి తెలిసింది.
డాక్టర్: జలందర్ ఓ మనిషి నీళ్ళలో మునిగిపోతుంటే ధైర్యంగా దూకి కాపాడావంటే నీకు ఏ పిచ్చీ లేదన్నమాటే. నిన్ను వెంటనే డిశ్చార్జ్ చేసే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.
జలందర్: చాలా సంతోషం డాక్టర్.
డాక్టర్: ఇంతకి నువ్వు కాపాడిన ఆ రోగి ఎక్కడ?
జలందర్: అదా.... నీళ్లల్లో బాగా నానిపోయాడు కదా డాక్టర్.... అందుకని ఎండలో ఆరబెట్టాను గర్వంగా చెప్పాడు.
ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: మేడం ఇ
ది యురిన్ శాంపిల్ కాదు. యాపిల్ జ్యూస్ వెంకాయమ్మతో చెప్పాడు .
వెంకాయమ్మ: అయ్యో అలాగా నేను అర్జంటుగా ఒక పోను చేసుకోవచ్చా.
ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: ఎవరికి మేడం?
వెంకాయమ్మ: ఇంకెవరికి మా ఆయనకి. ఆయన లంచుబాక్సులో యాపిల్ జ్యూస్ బాటిలుకు బదులుగా యురిన్ శాంపిల్ బాటిల్ పెట్టుంటా ఆందోళనగా చెప్పింది .
ఈ పేజి మొదటికి వెళ్ళండి.