హాస్యాంజలికి స్వాగతం...
తాగుపోతు హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తాగుపోతు హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

నిజమా... తాగానా

11, ఫిబ్రవరి 2010, గురువారం


రాత్రి రెండింటికి రోడ్డు పక్క మురికి గుంటలో పడున్నాడు వెంకటేశం.
అటుగా వెళ్తున్న ఓ పోలీసు అధికారి జీపు ఆపి వచ్చి బయటకు లాగుతూ ఇంటికి వెళ్ళవా... ఎంత తాగావేంటీ ఒకటే వాసన అన్నాడు.
సర్‌ నేను తాగానా సందేహంగా అడిగాడు వెంకటేశం.
నువ్వు కాకపోతే నేను తాగానా కోపంగా అన్నాడు పోలీసు.
అమ్మయ్య, అయితే నేను తాగానన్నమాట. ఇంకా నయం, లేవలేకపోతుంటే కాళ్లకేమయిందోనని
అంబులెన్స్‌కి ఫోన్‌ చేద్దామనుకుంటున్నా... తాపీగా చెప్పాడు వెంకటేశం.

Read more...

తాగనే తాగను

6, జనవరి 2010, బుధవారం


మల్లేష్: నేనెప్పుడూ ఇంటి దగ్గర తాగను. తాగి ఇంటికి వెళ్లను. ఆ విషయం మా ఆవిడకు తెలిస్తే రోజంతా మాట్లాడదు స్నేహితుడి హరితో చెప్పాడు.
హరి: నేనూ అంతే, ఇంట్లో తాగను చెప్పాడు.
మల్లేష్: ఏం, మీ ఆవిడా రోజంతా మాట్లాడదా?
హరి: కాదు నాతోపాటే తాగుతూ కూర్చుంటుంది చెప్పాడతడు.

Read more...

బిల్డింగ్‌ను పట్టుకో

5, జనవరి 2010, మంగళవారం


వాచ్మెన్: అయ్యగారూ నేను తాళం తీస్తా. ఆ కీస్ ఇలా ఇవ్వండి ఫుల్‌గా తాగి ఊగుతూ తాళం తీయలేక పోతున్న యజమానితో అన్నాడు.
యజమాని: వెధవా, తాళం నేను తీస్తాకానీ బిల్డింగ్ను అటూ ఇటూ ఊగకుండా పట్టుకో చాలు చెప్పాడు తను ఊగుతూ.

Read more...

అన్నింటా నువ్వేనా

22, డిసెంబర్ 2009, మంగళవారం

మీకు ఇప్పటికే మందెక్కువయింది. ఇంటికి వెళండి… మరో ఫుల్ బాటిల్ అడిగిన కస్టమర్తొ చెప్పాడు బార్ జమాని. అతడు బయటకు వచ్చేశాడు. నాలుగడుగులు ముందుకేసి మరో ద్వారం గుండా బారులొపలికి వచ్చి ఫుల్ ఒకటిఅని అడిగాడు. వద్దు సార్ ఇంకా తాగితే ఇంటికి వెళ్లలేరు అని చెప్పి పనబ్బాయితొ రోడ్డు వరకూ పంపించాడు. అలా వెళ్లినాయన వెనుక వైపు నుంచి వచ్చి ఫుల్ బాటిల్ఆర్డరిచ్చాడు. మీకు ఎక్కువయిందని చెప్పానా, ఒరే అబ్బాయ్ ఈయన్ని ఆటో ఎక్కించ్చు అని పిలిచే సరికి.. ఏబారుకు వెళ్లినా నువ్వే ఉంటున్నావేంటి? అని చిరాకుగా అడిగాడు బార్ ఓనరుని.

Read more...

ఆర్డర్...ఆర్డర్....

18, డిసెంబర్ 2009, శుక్రవారం


ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి కనిపించిన వారందరితో గొడవపడుతుంటే పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చారు. ఆర్డర్.. ఆర్డర్... వచ్చిరావడంతోనే అన్నాడు జడ్జి. రొండు పెగ్గుల... విస్కీ, అందులోకి ఓ గ్లాసెడు షోడా, నంజుకోవడానికి చిప్సు వెంటనే చెప్పాడా తాగుబోతు బోనులోనే తూలుతూ.

Read more...

ప్లాస్టర్ చెప్పిన నిజం

4, డిసెంబర్ 2009, శుక్రవారం


సుందరం ఓరోజు బాగా తాగి ఇంటికొచ్చాడు. బార్య చివాట్లు వేస్తుందన్న భయం పికుతూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా బెడ్రూంలోకి వెళ్లి, వాసన రాకుండా ఏదైనా చేయాలనీ ఆలోచించాడు. ఒక ఆలోచన తట్టింది. వెంటనే అద్దంలో చూసుకుంటూ నోటికి ప్లాస్టర్ వేసుకొని గప్ చుప్ గా పడుకున్నాడు. తెల్లారి బద్దకంగా ఒళ్ళు విరుచుకుని లేచిన సుందరాన్ని బార్య నిలదీసింది.
మళ్లీ తాగోచ్చారు కదూ!
లేదే తప్పించుకోజుశాడు సుందరం.
మరి ఈ అద్ధానికి ప్లాస్టర్ ఎవరు వేసినట్టు?

Read more...

నోటిM

25, అక్టోబర్ 2009, ఆదివారం

ముగ్గురు మిత్రులు కలిసి బారుకి వెళ్లారు. అక్కడ బారుగర్ల్ డాన్సు చేస్తుంది.ఆమె మొదటి వాడి వద్దకు రాగానే ఐదువందల నోటు తిసి ఆమె నోట్లో పెట్టాడు. మళ్లీ డాన్స్ కొనసాగింది. ఈసారి రెండోవాడి వద్దకు వచ్చిందామే, రెండోవాడు వెయ్యినోటు ఆమె నోట్లో పెట్టాడు. ఆ రెండు నోట్లు అలా నోటితో పట్టుకునే మూడోవాడి వద్దకు వచ్చింది. మూడో అతను జేబులోంచి ATM కార్డు తీశాడు. బారుగర్ల్ ముక్కుమీద దాంతో ఒకసారి గీసి ఆమె నోటిలోని పదిహేనొందలు తీసుకున్నాడు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.