హాస్యాంజలికి స్వాగతం...
తండ్రి పిల్లల మద్య హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తండ్రి పిల్లల మద్య హాస్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

అరుపు

1, ఏప్రిల్ 2013, సోమవారం


"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

Read more...

ఈజిప్ట్ మమ్మీ

6, జనవరి 2013, ఆదివారం

కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"

"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.

"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"

Read more...

వెంట్రుక చెప్పిన నిజం

30, డిసెంబర్ 2012, ఆదివారం


"ఇవాళ వంట అమ్మా చేసిందా నాన్న?" అడిగాడు హైటెక్ కొడుకు.
"ఎలా కనుక్కున్నావురా?" అడిగాడు తండ్రి.
"పిజ్జాలో పొడవాటి వెంట్రుక వచ్చింది. మీది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు

Read more...

కాకి తెలివి

16, డిసెంబర్ 2012, ఆదివారం

"వెధవా.. దున్నపోతా... నెత్తిమీదకు పదేళ్ళు వచ్చాయి. చెల్లెలికి biscuit చిన్న ముక్క ఇచ్చి పెద్దది నువ్వు తింటూ దాన్నేడిపిస్తున్నావా?  కాకి చూడు, ఆహారం తెచ్చి ముందు పిల్లలకిచ్చి తరువాత తాను తింటుంది" టింకూను మందలిస్తూ..  biscuit లాక్కున్నాడు సతీష్.

"కాకి తినెది ఎంగిలి మెతుకులు. అవైతే నేనూ మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని" అన్నాడు టింకు.

Read more...

చూస్తూ...

2, డిసెంబర్ 2012, ఆదివారం

"సిగ్గులేని వెధవా! ఎదురింట్లో అనూరాధను చూడు. 95 percent తెచ్చుకుంది. నువ్వు డిమ్కాకొట్టావు. అసలా అనూరాధ...."
కొడుకిని చేతులతో పైకెత్తి కేకలేస్తున్నాడు కోదండం.

"ఎందుకు పదిసార్లు అనూరాధ, అనూరాధ అని జపం చేస్తావు. అనూరాధనుచూసి చూసే గతి పట్టాను" చెప్పాడు కొడుకు.

Read more...

ఇది మరీ అన్యాయం

15, జులై 2010, గురువారం

A Midsummer Night's Dream for Kids (Shakespeare Can Be Fun!)ప్రమోద్: "ఇది మరీ అన్యాయం. రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు
తండ్రి: "అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు
ప్రమోద్: "లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది, తప్పుదూ" ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు

Read more...

సన్నాయి రాగం

11, జులై 2010, ఆదివారం

Pampers Sensitive Baby Wipes Refills, 192-Count Packages, Pack of Four (768 wipes)కొడుకు: "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" అడిగాడు తండ్రిని.
తండ్రి: "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు.
కొడుకు: "ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు అమాయకంగా.

Read more...

పులి బిడ్డ

5, జులై 2010, సోమవారం

మోహన్: మన వంశం ఎంత గొప్పదో తెలుసా! మా నాన్న పులిలా బ్రతికాడు. నేను అంతే. నువ్వు కూడా పులిబిడ్డలా బ్రతకాలి. సరేనా కొడుకుతో అన్నాడు.
కొడుకు: 'నిజమే నాన్న! అమ్మ కూడా ఇదే చెప్పింది'
మోహన్: 'ఎం చెప్పింది'
కొడుకు: 'నువ్వు మనిషివి కాదూ మృగానివని....'

Read more...

సిగ్గు

25, జూన్ 2010, శుక్రవారం


కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బె.. ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అని అరిచాడు.

"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.

Read more...

నాన్నకే...

25, ఏప్రిల్ 2010, ఆదివారం


కిట్టు: కోపం, బాధ రెండూ తగ్గడానికి మందులేమైన ఉన్నాయా మెడికల్ షాపతన్ని అడిగాడు.
మెడికల్ షాపతడు: ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు? అని అడిగాడు.
కిట్టు: ఇంకెవరికి, మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి అని చెప్పాడు.

Read more...

దూరదృష్టి

18, జనవరి 2010, సోమవారం

కిరణ్: నాన్న... నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి.
తండ్రి: ఎందుకు? అని ప్రశ్నించాడు.
కిరణ్: కళ్ళజోడు కొనాలి.
తండ్రి: ఇప్పుడు నీ కళ్ళకు ఏం రోగం?
కిరణ్: దూరంగా ఉన్న వస్తువులు అస్సలు కనబడట్లేదు.
తండ్రి: కిరణ్‌ను ఇంటి బయటకు తీసుకెళ్ళి ఆకాశం వంక చూపిస్తూ అడిగాడు... అదేమిట్రా?
కిరణ్: చంద్రుడు నాన్నా.
తండ్రి: ఇంతకంటే దూరం చూడాల్సిన అవసరం నీకు ఎందుకొస్తుంది చెప్పు.

Read more...

బార్బర్!

12, జనవరి 2010, మంగళవారం


కూతురు: నాన్నా ఇన్‌స్పెక్టర్ పదానికి స్పెల్లింగ్ ఏమీటీ?
తండ్రి: ఎందుకురా?
కూతురు: ఈ రోజు స్కూల్లో ఓ అప్లికేషన్ పూర్తి చేయమని ఇచ్చారు. అందులో ఆక్యుపేషన్ అని ఉంది. అక్కడ రాయడానికి.
తండ్రి: ఇన్‌స్పెక్టర్‌కు స్పెల్లింగ్ రాదన్నావుగా. మరి అక్కడ ఏం రాశావ్?
కూతురు: బార్బర్ అని రాశా. ఆ స్పెల్లింగ్ నాకు వచ్చుగా.

(ఇది సరదాకి మాత్రమే ఎవరిని కించ పరచడానికి కాదు)

Read more...

తమ్ముడో

23, డిసెంబర్ 2009, బుధవారం


విన్ని: డాడి, ఇందాక ట్రైన్ ఆగింది కదా అది ఏ స్టేషన్?
డాడి: పుస్తకం చదువుతున్నాకదా ఎందుకు డిస్టర్బ్ చేస్తావు వచ్చేటప్పుడు చూద్దాంలే.
విన్ని: మరి అంతవరకూ తమ్మూడు ఆ ఊళ్లో ఎవరి దగ్గర ఉంటాడు?

Read more...

ఏదో ఒకటి

15, నవంబర్ 2009, ఆదివారం


ఏడేళ్ళ బిన్ను సీరియెస్గా బొమ్మగీస్తున్నాడు.
బిన్నునాన్న: ఏం చేస్తున్నావురా? అని అడిగాడు.
బిన్ను: నీ బొమ్మ వేస్తున్నా నాన్నా.
బిన్నునాన్న: అబ్బా.... గుడ్
(కాసేపటికి
- బొమ్మ బాగా రావట్లేదు నాన్నా చెప్పాడు బిన్ను)
బిన్నునాన్న: సరేలే, వదిలేయ్.
బిన్ను: పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా!

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.