ఆలస్యం
4, నవంబర్ 2012, ఆదివారం
"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం ?" అడిగింది టీచర్ స్టూడెంట్ని"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పింది స్టూడెంట్...
"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం ?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
రాంమూర్తి:తన కొడుకు చదివే స్కూలుకు వెళ్లి, మావాడు బాగా చదువుతున్నాడా అని క్లాసు టిచర్ను అడిగాడు.
స్కూల్ టిచర్: మిగతా సబ్జెక్టులు ఫరవాలేదు కానీ లెక్కలైతే రావట్లేదు.
రాంమూర్తి:ఏం?
స్కూల్ టిచర్: నాలుగోక్లాసుకొచ్చాడు. ఇప్పటికీ 2 +2= ఎంత అంటే చెప్పట్లేదు.
రాంమూర్తి: ఎంతఅంటున్నాడేమిటి?
స్కూల్ టిచర్: మూడు(౩) అంటున్నాడు.
రాంమూర్తి: పర్లేదులే..... ఒకటేగా తక్కువ చెప్పాడు!

ఆరేళ్ల శ్వేతని ఎవరైనా పేరు అడిగితే నేను ప్రకాశ్ గారి అమ్మాయినని చెప్పసాగింది.
అది గమనించిన తల్లి, అలా చెప్పకూడదు నానా, నా పేరు శ్వేతా అని చెప్పాలి' అని చెప్పింది.
ఓ రోజు శ్వేతని స్కూల్లో చూసిన ఓ వ్యక్తి, నువ్వు ప్రకాశ్ గారి అమ్మాయివి కదూ? అనడిగాడు.
నేను అదే అనుకున్నాను. కాని మా అమ్మ కాదని చెప్పింది! అంది భారంగా నిట్టూర్చుతూ.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.