హాస్యాంజలికి స్వాగతం...

పంచావతారం

30, నవంబర్ 2009, సోమవారం


నగేష్ చెకప్ కోసం వెటర్నరి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
డాక్టర్: చూ
డు మిస్టర్.... మీరు వెళ్లాల్సింది నా ఎదురుగ్గా ఉన్న క్లినిక్కు సూచించాడు.
నగేష్: లేదు డాక్టర్.... నేను మీ కోసమే వచ్చాను.
డాక్టర్: ఇదిగో.... నువ్వు నాలా మాట్లాతున్నావు. నీ బాధేంటో చెప్పుకోగలుగుతున్నావు. అంటే నువ్వు మనిషివి. కానీ నేను పశువులకు వైద్యం చేసే డాక్టర్నే.
నగేష్: విషయం తెలిసే వచ్చాను
డాక్టర్: ఎందుకనీ?
నగేష్: ఎందుకంటే... పొద్దున్నే గుర్రంలాగా పరుగెత్తుకుని ఆఫీసుకు వెళ్ళాను. రోజంతా గాడిదలా పనిచేస్తాను. బాస్ పిలిచినప్పుడల్లా కుక్కలా తోక ఊపుతాను. రాత్రి ఇంటికి వచ్చి నా భార్యను చూడగానే పిల్లినైపోతాను......

Read more...

నా సొమ్ముతో సదివించుకుంటున్నారన్నమాట....

29, నవంబర్ 2009, ఆదివారం


చౌరస్తాలొ ఉండే బిచ్చగాడికి రోజూ పది రూపాయలు ఇవ్వటం సూరి అలవాటు. ఉన్నట్టుండి ఒకరోజు నుంచీ ఏడున్నర రూపాయలే వేయడం మొదలు పెట్టాడు.
అలా రెండేళ్ళు గడిచాక ఒకనాడు ఐదు రూపాయలే ఇచ్చాడు.
బిచ్చగాడు: ఉండబట్టలేక సామీ... మొదట్లో పది రూపాయలు ఏసినారు గందా! మద్దిలో ఏడున్నరే యేశారు. ఇప్పుడదీ తగ్గించి ఐదు రూపాయలే ఇస్తున్నారేంది! కనికరించండి బాబయ్యా అన్నాడు.
సూరి: మొదట్లో నా పెద్దకొడుకు కాలేజీ చదువులకు వచ్చాడు. ఖర్చులన్నీ తగ్గించాను. అందుకే నీకూ రెండున్నర తగ్గించాను.ఆ తర్వాత నా రెండో కొడుకూ పై చదువులకొచ్చాడు....
బిచ్చగాడు: ఐతే నా సొమ్ముతో మీ కొడుకుల్ని సదివించుకుంటున్నారన్నమాట కానియ్యండి బాబయ్యా ఏం సేత్తాం మద్యలో కలగజేసుకొని నిట్టూర్చాడు.

Read more...

ఎండలో ఆరబెట్టాను....

28, నవంబర్ 2009, శనివారం


పిచ్చాసుపత్రి పరిసరాల్లో ఉన్న బావిలో ఓ రోగి పడిపోయాడు. వెంటనే మరో రోగి జలందర్ అందులోకి దూకి అతడిని కాపాడాడు. ఈ విషయం అక్కడి డాక్టర్ కి తెలిసింది.
డాక్టర్: జలందర్ మనిషి నీళ్ళలో మునిగిపోతుంటే ధైర్యంగా దూకి కాపాడావంటే నీకు పిచ్చీ లేదన్నమాటే. నిన్ను వెంటనే డిశ్చార్జ్ చేసే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.
జలందర్: చాలా సంతోషం డాక్టర్.
డాక్టర్: ఇంతకి నువ్వు కాపాడిన ఆ రోగి ఎక్కడ?
జలందర్: అదా.... నీళ్లల్లో బాగా నానిపోయాడు కదా డాక్టర్.... అందుకని ఎండలో ఆరబెట్టాను గర్వంగా చెప్పాడు.

Read more...

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

Read more...

మంచిరోజులు

27, నవంబర్ 2009, శుక్రవారం


మంత్రి: మీ పత్రికవల్ల నాకు అవమానం జరిగింది. క్షమాపణ ప్రచురించకపోతే ఊరుకోను అంటూ మండిపడ్డాడు .
ఎడిటర్: చాల్లే ఊరుకోండి. పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీరే చెప్పారు. మీ స్టేట్మెంట్లో అక్షరం పొల్లు పోకుండా వేశాం. మా తప్పేంలేదు అని చెప్పాడు.
మంత్రి: స్టేట్మెంట్లో తేడాలేదులే. కానీ దాన్ని తీసుకెళ్ళి ప్రజలకు మంచిరోజులు అన్న కాలంలో వేశారు విసురుగా చెప్పాడు మంత్రి.

Read more...

ఆపరేషన్ మౌత్

26, నవంబర్ 2009, గురువారం


సువర్ణసుందరి: నా నోరు పెద్దగా ఉందని మీరెప్పుడూ బాధపడుతూ ఉంటారుగా.... నిన్న ఓ డాక్టర్ను కలిశాను.... ఆవిడ కొన్ని కుట్లు వేసి నోటిని సగం సైజు తగ్గిస్తుందట..... అదీ ఇదువేల్లోనే... ఉత్సాహంగా పూర్తి చేసింది.
భర్త: ఇదిగో..... పదివేలు వెంటనే అన్నాడు.

Read more...

నాన కోసం

25, నవంబర్ 2009, బుధవారం


విష్ణు ఇంటికొచ్చేసరికి భార్య సీత తన ఆరునెలల బాబుకి మాటలు నేర్పిస్తూ కనబడింది.
సీత: నా నా... అను.. నా నా అంటోంది ఆవిడా.
విష్ణు: అమ్మకు బదులు నాన్నా అని నేర్పిస్తున్నందుకు ఎంతో మురిసిపోయాడు.
వారాలు గడిచాయి.
ఓ అర్ధరాత్రి నా నా.... అంటూ బాబు ఏడుపు మొదలు పెట్టడంతో భార్యాభర్తలకు మెలకువ వచ్చింది.
సీత: అటుతిరిగి ముసుగుపెడుతూ... చుడండి... బాబు మిమ్మల్నే పిలుస్తూన్నాడు వెళ్లి ఎత్తుకోండి అని చెప్పింది.
అప్పుడు అర్ధమైంది నానా... అని ఎందుకు నేర్పించిందని.)

Read more...

పిల్లలకు ఫ్రీ

24, నవంబర్ 2009, మంగళవారం


బస్టాండులో నిల్చున్నారు రవి, రవిభార్య, వాళ్ల ఇద్దరు పిల్లలు.
రవి: ఏయి.... ఆటో వస్తావా.... ఎంత? పిలిచాడు.
ఆటోడ్రైవర్: మీరూ మేడం ఇరవై ఇరవై ఇవ్వండి. పిల్లలను ఊరికే తీసుకెళ్తాను తెలివిగా చెప్పాడు.
రవిభార్య: పిల్లలూ మీరు అంకులుతో వెళ్ళండి. మేము వెనక బస్సులో వచ్చేస్తాం వెంటనే అంది.

Read more...

ఒకటేగా తక్కువ

23, నవంబర్ 2009, సోమవారం


రాంమూర్తి:తన కొడుకు చదివే స్కూలుకు వెళ్లి, మావాడు బాగా చదువుతున్నాడా అని క్లాసు టిచర్ను అడిగాడు.
స్కూల్ టిచర్: మిగతా సబ్జెక్టులు ఫరవాలేదు కానీ లెక్కలైతే రావట్లేదు.
రాంమూర్తి:ఏం?
స్కూల్ టిచర్: నాలుగోక్లాసుకొచ్చాడు. ఇప్పటికీ 2 +2= ఎంత అంటే చెప్పట్లేదు.
రాంమూర్తి: ఎంతఅంటున్నాడేమిటి?
స్కూల్ టిచర్: మూడు(౩) అంటున్నాడు.
రాంమూర్తి: పర్లేదులే..... ఒకటేగా తక్కువ చెప్పాడు!

Read more...

ఇక ఆపు

22, నవంబర్ 2009, ఆదివారం


అనిల్ సునీల్ స్నేహితులు. ఇద్దరూ సముద్రంమీద ప్రయాణిస్తున్నారు. ఇంతలో తుపాను రావడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నౌకకు ఏమవుతుందో అని అనిల్కు భయం పట్టుకుంది. మోకాళ్ళ మీద కూర్చుని కళ్లు మూసుకొని దేవుడిని బిగ్గరగా ప్రార్ధించడం మొదలుపెట్టాడు.
అనిల్: స్వామీ! నేను అబద్ధాలు చెప్పాను... జూదమాడాను... మద్యం సేవించాను... మనుషులు చేయగలిగిన అన్ని చేడ్డపనులూ చేశాను. నువ్వు నన్ను కరుణించి ఈ ఆపదనుంచి గట్టేక్కిస్తే గనక ఇకపై నేను..... అంటూ ప్రార్ధన సాగుతుండగానే....
సునీల్: అనిల్ని పట్టి కుదిపేస్తూ చెప్పాడు. ఏయ్.... తొందరపడి ప్రమాణం అదీ చేసేవు.... చూడు ఒడ్డు కనిపిస్తుంది.

Read more...

కుక్క బుద్ది

21, నవంబర్ 2009, శనివారం


చొక్కారావు: మా టైగర్ చాలా తెలివైంది అని చెప్పాడు.
జగ్గారావు: ఏంటో దాని గొప్పతనం? అంటూ ప్రశ్నించాడు.
చొక్కారావు: పొద్దున్నే నాకు పేపర్ తెచ్చిస్తుంది
జగ్గారావు: ఇదీ విశేషమేనా... అన్ని కుక్కలూ చేసేదేగా
చొక్కారావు: కానీ మేం పేపర్ వేయించుకోముగా!

Read more...

ఒలికి పోతుంది

20, నవంబర్ 2009, శుక్రవారం


వీరయ్య: డ్రైవింగులో తాగడం డేంజర్. అందుకే కారు నడిపేటప్పుడు నేను అస్సలు తాగను. అనుభవజ్ఞులు చెప్పిన మాట అది అన్నాడు .
గణేష్: కరక్టే... నాకు ఆ అనుభవం ఉంది. గేరు మార్చినా, బ్రేకు వేసినా ఒలికి పోతుంది కదా. అలా వేస్టు చేయడంకన్నా తాగాకపోవడమే మంచిది అని చెప్పాడు .

Read more...

నాకెంత సిగ్గో.....

19, నవంబర్ 2009, గురువారం


రాణి: అంతా నా ఖర్మ. ఇంటి అద్దె మా నాన్న కడుతున్నారు. మన బట్టలు అన్నయ్య కొంటున్నాడు. అక్కయ్య కూరలు పంపిస్తోంది. కరెంటు బిల్లు కట్టేది తమ్ముడు. మా చెల్లెలు బియ్యం పంపిస్తేనే పొయ్యిలో పిల్లి లేచేది. చెట్టంత మగాడు మీరుండి, సిగ్గుతో చస్తున్నా తల బాదుకుంటూ భర్త వద్ద వాపోయింది.
వినోద్: అంతమంది అదో ఇదో పంపిస్తూ ఉంటేనే నువ్వంత సిగ్గుపడుతున్నావే. మా అన్నయ్యలూ, అక్కలూ, తమ్ముడూ ఊళ్ళోనే ఉండీ ఏమీ పంపించకపోతే నాకెంత సిగ్గుగా ఉండీ ఉంటుందో ఆలోచించు దిగులుగా చెప్పాడు.

Read more...

ఏదో ఒకటి

15, నవంబర్ 2009, ఆదివారం


ఏడేళ్ళ బిన్ను సీరియెస్గా బొమ్మగీస్తున్నాడు.
బిన్నునాన్న: ఏం చేస్తున్నావురా? అని అడిగాడు.
బిన్ను: నీ బొమ్మ వేస్తున్నా నాన్నా.
బిన్నునాన్న: అబ్బా.... గుడ్
(కాసేపటికి
- బొమ్మ బాగా రావట్లేదు నాన్నా చెప్పాడు బిన్ను)
బిన్నునాన్న: సరేలే, వదిలేయ్.
బిన్ను: పోనీ తోక పెట్టేసి, కోతి అని కింద రాసేయనా!

Read more...

ప్రతిబింబం

14, నవంబర్ 2009, శనివారం


అద్దం కొత్తగా వచ్చిన రోజులు. పోలంనుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దంముక్క దొరికింది. అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు. చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు. ఆ అద్దం ముక్కను ఇంట్లో ఓచోట దాచిపెట్టి రోజు ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతుండేవాడు.
సుబ్బయ్య
ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది. ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తిసిచూస్తే ఏముంది? అందులో 30 ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది. అంతే! భర్తకు ఎవరితోనో సంబంధముందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మను పిలిచి- ఆయనేలాంటి పనిచేశారో చూడు అని కన్నీరు పెట్టుకుంది.
ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని- ఏయ్ పిచ్చిమొహమా.... ఇంత ముసలావిడతో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే.... ఎవరైనా వింటే నవ్విపోతారు అంది.

Read more...

బాలలదినోత్సవ శుభాకాంక్షలు

చిన్నారి హాస్యాభిమానులకు "బాలలదినోత్సవ మరియు నెహ్రూ జయంతి" శుభాకాంక్షలు

Read more...

అసలు పేరేమిటి?

10, నవంబర్ 2009, మంగళవారం


బబ్బులు కారు గోతిలో చిక్కుకుంది.
దగ్గరలోని
గుర్రలశాల నుంచి ఓ గుడ్డిగుర్రాన్ని తీసుకొచ్చి కారుకు కట్టాడు అక్కడి వ్యక్తి. కమాన్.... లోటస్.. ఊఁ.... లాగెయ్ రిక్కీ.... నువ్వు కూడా....
డార్కి.... ఊపిరి బిగబట్టి ఒక్క ఊపులో హుపుమంటూ లాగాలి
గుర్రం ఒక్క ఉదుటున లాగగానే కారు బయటకు వచ్చేసింది.
థాంక్స్ ఒక్క గుర్రానే అన్నీ పేర్లతో పిలిచారు. ఇంతకీ దాని అసలు పేరేమిటి? అని అడిగాడు బబ్బులు.
దాని పేరు లోటసే. మిగతావన్నీ దాని తోటి గుర్రాలు. ఇది గుడ్డిదైనా భలే తెలివైనది. పనైనా తానొక్కతే ఎందుకు చెయ్యాలని తెగ పంతం దానికి చెప్పాడా వ్యక్తి.

Read more...

అందరికి ఆహ్వానం

9, నవంబర్ 2009, సోమవారం

(దయచేసి పూర్తిగా చదవండి)
తెలుగు భాషాభిమానులందరికీ స్వాగతం. నా చదువు ఇంగ్లీష్ మీడియం అయినా నేను, తెలుగు భాషాభిమానినే అలాగని తెలుగులో పండితున్ని కాదు పామరున్ని మాత్రమే అందుకే అచ్చు తప్పులు దొర్లితే తెలుగువారు మన్నించాలి.
తెలుగు భాషంటే నాకెంతో అభిమానము అలాగని ఇంగ్లీష్ మరియు ఇతర భాషలంటే ఎలాంటి ద్వేశమూ లేదు కన్న తల్లి లాంటిది కాబట్టే పుట్టిన తరువాత మాట్లాడే భాషను మాతృభాష అని పిలుస్తారు. భార్యలాంటిది ఆంగ్లభాష అని నేననుకుంటాను.
నా ఉద్దేశంలో భార్యకోసం తల్లిని, తల్లికోసం భార్యని చులకన చేయడం తప్పిదమే ఔతుంది. మనమంటూ ఉన్నామంటే దానికి కారణం తల్లి, మనం మాటలు నేర్చుకోడానికి కారణం మాతృభాష. తల్లి తరువాత మనకోసం తపించేది భార్య, మనం రాష్ట్రాలు, దేశాలు దాటి మన తెలుగువారి ఖ్యాతిని పెంచడానికి ఆంగ్లభాష అవసరముంటుంది. కన్నతల్లి, కట్టుకున్నభార్య ఇద్దరూ రెండు కల్లలాంటివారు ఇద్దరూ సమానమేకదా.
నా మొదటి తెలుగు బ్లాగు రాంగోపాల్స్ బ్లాగులో సామాజిక విషయాలపై వ్రాసాను సమయం చిక్కకపోవడంవల్ల ఎక్కువ టపాలు వ్రాయలేకపోతున్నాను త్వరలోనే అందులో టపాలు వ్రాస్తాను.
నా రెండో తెలుగు బ్లాగు మీరు చూస్తున్న హాస్యాంజలి నేను విన్నా, చదివిన జోకులను ఇక్కడ వ్రాస్తున్నాను సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు. కొందరికి హాస్యమన్న హాస్యాన్ని గురించి మాట్లాడడమన్న అపహాస్యంగా ఉండవచ్చు. నా దృష్టిలో నవ్వు భాధలను తరిమికొట్టే టానిక్. అది మనిషికి మాత్రమే ఉన్న గొప్పవరం. "నవ్వుతూ బ్రతకాలి నవ్వుతూ చవాలనేదే నా కోరిక" మనం సంతోషంగా ఉంటేనే ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతాం.
తెలుగు భాష ఒకరి సొత్తు కాదు అలాగే తెలుగు హస్యాం ఒకరి సొత్తు కాదు. నేను విన్న జోకులను అందరితోని పంచుకొని వారిని కొంతైనా సంతోషపరచాలని బ్లాగుని రూపొందించాను. అలాగే ప్రతి ఒక్కరు హాస్యాన్ని అనుభవపూర్వకంగానో ఎక్కడైనవినో చదివో నవ్వుకొనే ఉంటారు. నవ్వురానివారికి మనమేమిచేప్పలేము అది manufacture defectఅని అనుకోవాలంతే. కాని జోకులు విని నవ్వుకున్న వారు, నవ్వంటే ఇష్టమున్న ప్రతి ఒకరు ఒక హాస్య బ్లాగ్ని క్రియేట్ చేస్తే, ఇంటర్నెట్ మొత్తం హాస్యబ్లాగులతో నిండిపోతుంది. అందుకే నాకో చిన్న ఆలోచన తట్టింది ధీన్ని పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
మీకు తెలిసిన జోకులతోపాటు, మీ బ్లాగ్ URL లేదా ఈమెయిల్ ఐడిని కామెంటు బాక్సులోరాయండి. దానికి తగిన animation జతచేసి మీ పేరు మరియు మీ బ్లాగ్ లంకేతో కొత్త టపాగా ప్రచురిస్తాను. మీకు నచ్చితే వెంటనే జోకు రాయడం ప్రారంభించండి.
ఇంటర్నెట్ సెంటేరుకేల్లి అప్పుడప్పుడు బ్లాగులు చూసే వారికోసమని టపాను రిపీట్ చేస్తాను. రోజు నెట్లో విహారించేవారు దయచేసి విసుక్కోకండి.

"నవ్వేజనా సుఖినోభవంతు"

Read more...

అమ్మ కాదంది

8, నవంబర్ 2009, ఆదివారం


ఆరేళ్ల శ్వేతని ఎవరైనా పేరు అడిగితే నేను ప్రకాశ్ గారి అమ్మాయినని చెప్పసాగింది.
అది గమనించిన తల్లి, అలా చెప్పకూడదు నానా, నా పేరు శ్వేతా అని చెప్పాలి' అని చెప్పింది.
ఓ రోజు శ్వేతని స్కూల్లో చూసిన ఓ వ్యక్తి, నువ్వు ప్రకాశ్ గారి అమ్మాయివి కదూ? అనడిగాడు.
నేను
అదే అనుకున్నాను. కాని మా అమ్మ కాదని చెప్పింది! అంది భారంగా నిట్టూర్చుతూ.

Read more...

చివరి కోరిక

7, నవంబర్ 2009, శనివారం

విక్రంకి ఓ హత్య కేసులో కోర్టు మరణశిక్ష విధించింది. అతడిని ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టారు.
పోలీస్ అధికారి: నీ చివరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగాడు.
విక్రం: నాకు భయంగా ఉంది. కాస్త నా చేయి పట్టుకుంటారా.

Read more...

'కార్తీక పౌర్ణమి' శుభాకాంక్షలు

2, నవంబర్ 2009, సోమవారం

హాస్యాభిమానులకి 'కార్తీక పౌర్ణమి' శుభాకాంక్షలు

Read more...

మంచి సంబంధం

మీనా: అమ్మాయి పెల్లిడుకోచ్చింది... మీకు చిమకుట్టినటైన లేదు రుసరుసలాడింది భర్త పైన .
భర్త: చేద్దాంలే.... అప్పుడే ఏంటి తొందర సంబంధం రావొద్దు' తాపిగా బదులిచ్చాడు వెంకట్.
మీనా: ... మంచి సంబంధం అని మీరు అలాగే పొద్దుపుచ్చండి... అయిన నాకు తెలియకడుగుతాను.... మంచి సంబంధమే కావాలని మా నాన్న కూడా పట్టుబట్టి ఉంటే మన పెళ్లి జరిగేదేనా' పాయింటు లాగింది మీనా.

Read more...

యాపిల్ జ్యూస్

1, నవంబర్ 2009, ఆదివారం

ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: మేడం ది యురిన్ శాంపిల్ కాదు. యాపిల్ జ్యూస్ వెంకాయమ్మతో చెప్పాడు .
వెంకాయమ్మ: అయ్యో లాగా నేను అర్జంటుగా ఒక పోను చేసుకోవచ్చా.
ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: ఎవరికి మేడం?
వెంకాయమ్మ: ఇంకెవరికి మా ఆయనకి. ఆయన లంచుబాక్సులో యాపిల్ జ్యూస్ బాటిలుకు బదులుగా యురిన్ శాంపిల్ బాటిల్ పెట్టుంటా ఆందోళనగా చెప్పింది .

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.