ఇంకా నయం
30, డిసెంబర్ 2009, బుధవారం
భార్గవి: హిప్నాటిస్ట్‌ని చేసుకోవడం తప్పైపోయింది బాధపడుతూ చెప్పింది.
సుశీల: ప్రేమించి మరీ చేసుకున్నావ్‌గా, ఏమైందే? అని అడిగింది కాఫీ తాగుతూ.
భార్గవి: నన్ను హిప్నటైజ్ చేసి, నేను ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బుల వివరాలన్నీ నాతోనేచెప్పించి, ఖాళీ చేసేస్తున్నాడే.
సుశీల: నయం కదూ.... పక్కవీధిలోని పద్మావతి వాళ్లాయన గురించి మీవారికి ఇంకా తెలిసినట్టులేదు.
భార్గవి: ఆయన ఏం చేస్తాడేం?
సుశీల: వాళ్లావిణ్ణి హిప్నటైజ్ చేసి, అంట్లు కూడా తోమిస్తున్నాడు.
భార్గవి: దీన్ని బట్టి చూస్తే మా ఆయనే నయమనిపిస్తుందే సుశీల.
2 చిరు నవ్వులు:
hahaha
అప్పారావు శాస్త్రి గారు,
మీ విలువైన సమయాన్ని హాస్యాంజలికి కెటాయించినందుకు చాలా చాలా... కృతజ్ఞతలండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి