చేతకాదూ
31, డిసెంబర్ 2009, గురువారం
సేల్స్ మెన్ కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది.
అధీకారి: మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా?
శ్రీకాంత్: లేరు.
అధీకారి: ఇప్పటివరకూ మీరు ఎవరినైనా ప్రేమించారా లేదాఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా?
శ్రీకాంత్: అబ్బే లేదండీ.
అధీకారి: అంటే, ముందు ఉద్యోగం తెచ్చుకుని తరవాత ప్రేమించాలనుకుంటున్నారా?
శ్రీకాంత్: నాకు కెరియరే ముఖ్యం. తరవాతే ప్రేమాగీమా. అయినా అమ్మాయిల వెనక తిరగడం, కబుర్లు చెప్పడం... ఇవన్ని నాకు చేతకాదులెండి.
అధీకారి: సారీ, మీకీ ఉద్యోగం ఇవ్వడం మాకు చేతకాదూ. ఎందుకంటే కమ్యూనికెషన్ స్కిల్స్ లేవు. మీమీద మీకు నమ్మకం కూడా లేదు. ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడాప్రేమలో పడేయలేనివాళ్లు మా ఉత్పత్తుల్ని ఎలా అమ్ముతారు? you can go.