ఆకాశంలో అరగంట టెన్షన్
22, జనవరి 2010, శుక్రవారం
విమానంలో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. ఉన్నది ఒకటే ప్యారాచూట్. అప్పుడు ప్రయాణికుల్లో వీళ్లంతా ఉంటే వారి స్పందన ఎలా ఉంటుందో ఊహిద్దాం!
నిరాశావాది: ఆ ప్యారాచూట్ పనిచేస్తుందన్న నమ్మకమేమిటని అనుమానించి దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తాడు.
ఆశావాది: ప్యారాచూట్ లేకపోయిన తాను బతుకుతాననే నమ్మకంతో దాన్ని తీసుకోడు.
బ్యూరోక్రాట్: అసలు ఆ ప్యారాచూట్ పనితీరూ తెన్నూ మీద ఓ నివేదిక వస్తే గానీ ఏం చేయాలో తేల్చుకోలేనంటాడు.
శాస్త్రవేత్త: అన్ని పరిస్థితుల్లోనూ అది ఒకేలా పనిచేస్తుందని నిరూపణ జరిగితేగానీ దాన్ని వినియెగించనంటాడు.
తత్వవేత్త: ఉన్నది నిజంగా ప్యారాచూటేనా? లేక అది మన భావనా? అన్న విషయం ఆలోచించాలంటాడు.
న్యాయవాది: విమానంలో ఒకే ప్యారాచూట్ ఉంచినందుకు ఎయిర్‌లైన్స్‌మీద దావా వేద్దామంటాడు.
రచయిత: "ఆకాశంలో అరగంట టెన్షన్" అన్న పుస్తకం రాయడానికి సరుకు దొరికిందని సంబరపడతాడు.
0 చిరు నవ్వులు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి