హాస్యాంజలికి స్వాగతం...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

26, జనవరి 2010, మంగళవారం

Read more...

ఆకాశంలో అరగంట టెన్షన్

22, జనవరి 2010, శుక్రవారం

విమానంలో ఏదో సాంకేతిక లోపం తలెత్తింది. ఉన్నది ఒకటే ప్యారాచూట్‌. అప్పుడు ప్రయాణికుల్లో వీళ్లంతా ఉంటే వారి స్పందన ఎలా ఉంటుందో ఊహిద్దాం!
నిరాశావాది: ఆ ప్యారాచూట్ పనిచేస్తుందన్న నమ్మకమేమిటని అనుమానించి దాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తాడు.
ఆశావాది: ప్యారాచూట్ లేకపోయిన తాను బతుకుతాననే నమ్మకంతో దాన్ని తీసుకోడు.
బ్యూరోక్రాట్‌: అసలు ఆ ప్యారాచూట్ పనితీరూ తెన్నూ మీద ఓ నివేదిక వస్తే గానీ ఏం చేయాలో తేల్చుకోలేనంటాడు.
శాస్త్రవేత్త: అన్ని పరిస్థితుల్లోనూ అది ఒకేలా పనిచేస్తుందని నిరూపణ జరిగితేగానీ దాన్ని వినియెగించనంటాడు.
తత్వవేత్త: ఉన్నది నిజంగా ప్యారాచూటేనా? లేక అది మన భావనా? అన్న విషయం ఆలోచించాలంటాడు.
న్యాయవాది: విమానంలో ఒకే ప్యారాచూట్ ఉంచినందుకు ఎయిర్‌లైన్స్‌మీద దావా వేద్దామంటాడు.
రచయిత: "ఆకాశంలో అరగంట టెన్షన్‌" అన్న పుస్తకం రాయడానికి సరుకు దొరికిందని సంబరపడతాడు.

Read more...

డొక్కు కారు

19, జనవరి 2010, మంగళవారం

అమెరికా వైశాల్యం భారత దేశం కంటే ఎక్కువా. ఓ సందర్భంలో రెండు దేశాల రైతులు కలుసుకున్నారు.
అమెరికా రైతు: మీ పొలం విస్తీర్ణం ఎంత? అని అడిగాడు భారత రైతుని.
భారత రైతు: నాకు రెండు ఎకరాలు ఉంది... అందులోనే అన్ని రకాలూ సాగుచేస్తాను... ఇంతకి మీది ఎంతుంటుంది? ఎదురు ప్రశ్నించాడు.
అమెరికా రైతు: అదా... నేను పొద్దున ఈ చివరినుంచి కార్లో బయలు దేరితే మధ్యాహ్ననికి గానీ అటువైపు చేరుకోను గర్వంగా చెప్పాడు.
భారత రైతు: నాకు కూడా అలాంటి డొక్కు కారే ఉంటే ఈ మద్యే అమ్మేశాను నవ్వుతూ అన్నాడు.

Read more...

దూరదృష్టి

18, జనవరి 2010, సోమవారం

కిరణ్: నాన్న... నాకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలి.
తండ్రి: ఎందుకు? అని ప్రశ్నించాడు.
కిరణ్: కళ్ళజోడు కొనాలి.
తండ్రి: ఇప్పుడు నీ కళ్ళకు ఏం రోగం?
కిరణ్: దూరంగా ఉన్న వస్తువులు అస్సలు కనబడట్లేదు.
తండ్రి: కిరణ్‌ను ఇంటి బయటకు తీసుకెళ్ళి ఆకాశం వంక చూపిస్తూ అడిగాడు... అదేమిట్రా?
కిరణ్: చంద్రుడు నాన్నా.
తండ్రి: ఇంతకంటే దూరం చూడాల్సిన అవసరం నీకు ఎందుకొస్తుంది చెప్పు.

Read more...

మగ పోకడ

17, జనవరి 2010, ఆదివారం


సునీల్, వినీల హొటల్‌కు వెళ్ళి భోంచేశారు. తిరిగి వస్తుంటే అయ్యె నా హ్యాండ్‌బ్యాగ్‌ అక్కడే మరచిపోయాను అని నాలుక కరుచుకుంది వినీల.
తప్పదన్నట్లుగా బైక్‌ వెనక్కి తిప్పాడు సునీల్.
దారి పొడవునా ఆమె మీద అరుస్తూనే ఉన్నాడు.
బండి దిగి హొటల్లోకి వెళ్తున్న భార్యతో చెప్పాడు సునీల్......
వినీ..... ఆ టేబుల్‌ మీద నా కళ్లద్దాలు కూడా ఉంటాయి చూడు.

Read more...

ఆయన కోరికే

16, జనవరి 2010, శనివారం


జడ్జి: ఏమిటీ, మీవారిని ఆయన కోరికమీదే చంపారా? ఆశ్చర్యంగా అడిగాడు.
సూరమ్మ: ఇలా రోజూ కొంచెం కొంచెం చంపుకుతినే కంటే ఒకేసారి గొంతుపిసికి చంపరాదే అన్నారండీ వినయంగా చెప్పింది.

Read more...

చాలా పొడవు

15, జనవరి 2010, శుక్రవారం


భర్త: డియర్ నేను చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్ళి చేసుకో!
భార్య: అవన్ని ఇప్పడెందుకండి! మీరలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది.
భర్త: పెళ్లి చేసుకున్నాక నా కారు అతనికిచ్చెయ్!
భార్య: అలాగే.
భర్త: నా గోల్డ్ కలర్ వాచీని అతని చేతికి నువ్వే స్వయంగా పెట్టు.
భార్య: సరే!
భర్త: నా సూట్లన్నింటినీ అతనికివ్వు!
భార్య: ఆ సూట్లు అతనికి సరిపోవు. తను మీకన్నా చాలా పొడవు.
భర్త: ? ? ? ? !!!!!!

Read more...

నో ఎంట్రీ

14, జనవరి 2010, గురువారం


చేతిలో కోడీతో బార్‌కు వెళ్లాడు పుళ్లారావు.
గార్డు: ద్వారంలోనే ఆపేస్తూ గాడిదలను మేము లోనికి అనుమతించం చెప్పాడు.
పుళ్లారావు: ఇది గాడిద కాదే ఆశ్చర్యంగా అన్నాడు.
గార్డు: నేను మాట్లాడుతోంది నీతో కాదు.... కోడితో అని బదులిచ్చాడు.

Read more...

హాస్యాభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు

Read more...

ఇంకా చాన్సుంది

13, జనవరి 2010, బుధవారం


డాక్టర్: కృష్ణారావు...... నీ ఆరోగ్యం బాగుపడాలంటే నేను చెప్పే రెండింటిలో ఒకదాన్నైనా విడిచిపెట్టాలి?
కృష్ణారావు: ఏంటవి డాక్టర్‌?
డాక్టర్: మద్యం ముట్టకూడదు లేదా మగువల జోలికి పోకూడదు.
కృష్ణారావు: అయితే ఈ రోజు నుంచి మందు తాగను డాక్టర్.
డాక్టర్: దీన్నే విడిచిపెట్టడానికి ప్రాత్యేక కారణం ఏమైనా ఉందా?
కృష్ణారావు: నేను ముసలివాడినయ్యాక కూడా మందు తాగొచ్చు డాక్టర్... రెండోది అలా కాదుగా.

Read more...

భోగి శుభాకాంక్షలు

Read more...

బార్బర్!

12, జనవరి 2010, మంగళవారం


కూతురు: నాన్నా ఇన్‌స్పెక్టర్ పదానికి స్పెల్లింగ్ ఏమీటీ?
తండ్రి: ఎందుకురా?
కూతురు: ఈ రోజు స్కూల్లో ఓ అప్లికేషన్ పూర్తి చేయమని ఇచ్చారు. అందులో ఆక్యుపేషన్ అని ఉంది. అక్కడ రాయడానికి.
తండ్రి: ఇన్‌స్పెక్టర్‌కు స్పెల్లింగ్ రాదన్నావుగా. మరి అక్కడ ఏం రాశావ్?
కూతురు: బార్బర్ అని రాశా. ఆ స్పెల్లింగ్ నాకు వచ్చుగా.

(ఇది సరదాకి మాత్రమే ఎవరిని కించ పరచడానికి కాదు)

Read more...

ఆయన ఘనతే

11, జనవరి 2010, సోమవారం


రామనాధం సర్వీసు పూర్తికాకుండా చనిపోయాడు. గ్రాట్యుటీ, పీఎప్‌, ఇన్స్యూరెన్స్‌లతోపాటు భార్యకు అదే డిపార్ట్‌మెంట్లో ఉద్యోగము వచ్చింది.
వచ్చిన డబ్బుతో రామనాధం భార్య, ఓ మంచి ఇల్లు, టీవీ, ఫ్రీజ్, సోఫాలు అన్నీ కొన్నది. పిల్లలకు స్కూటి, సైకిళ్లు కొనిచ్చింది.
అమ్మా ఇవన్నీ ఎలా వచ్చాయి? అని పిల్లలు అడిగితే.... ఇందులో నా గొప్పేమీ లేదు బాబు. అంతా మీ నాన్నగారి చలవ. ఆయన పోకుండా ఉండి ఉంటే మనమింకా ఆ దరిద్రంలోనే ఉండేవాళ్లం చెప్పిందా ఇల్లాలు.

Read more...

తాగనే తాగను

6, జనవరి 2010, బుధవారం


మల్లేష్: నేనెప్పుడూ ఇంటి దగ్గర తాగను. తాగి ఇంటికి వెళ్లను. ఆ విషయం మా ఆవిడకు తెలిస్తే రోజంతా మాట్లాడదు స్నేహితుడి హరితో చెప్పాడు.
హరి: నేనూ అంతే, ఇంట్లో తాగను చెప్పాడు.
మల్లేష్: ఏం, మీ ఆవిడా రోజంతా మాట్లాడదా?
హరి: కాదు నాతోపాటే తాగుతూ కూర్చుంటుంది చెప్పాడతడు.

Read more...

బిల్డింగ్‌ను పట్టుకో

5, జనవరి 2010, మంగళవారం


వాచ్మెన్: అయ్యగారూ నేను తాళం తీస్తా. ఆ కీస్ ఇలా ఇవ్వండి ఫుల్‌గా తాగి ఊగుతూ తాళం తీయలేక పోతున్న యజమానితో అన్నాడు.
యజమాని: వెధవా, తాళం నేను తీస్తాకానీ బిల్డింగ్ను అటూ ఇటూ ఊగకుండా పట్టుకో చాలు చెప్పాడు తను ఊగుతూ.

Read more...

వంట చెయ్యాలి

4, జనవరి 2010, సోమవారం


ఆఫిసర్: ఏమొయ్ చంద్రం, రాత్రి ఎనిమిదవుతోంది... ఇంకా పనిచేస్తున్నావు. అసలే కొత్తగా పెళ్ళైనవాడివి. పనెక్కువగా ఉంటే రేపు చేసుకొవచ్చులే.ఇక ఇంటికెళ్ళు అని మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు.
చంద్రం: అది కాదు సార్‌. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ఇంటికి ఎవరు ముందుగా వెళ్తే వాళ్ళు వంట చేయాలి. అందుకే.... నసిగాడు చంద్రం.

Read more...

మీ సొమ్మేం పోతుంది

3, జనవరి 2010, ఆదివారం

భార్య: అమ్మాయిని కొట్టారంట ఎందుకు?
భర్త: దానికి గాడిదనెక్కి ఊరేగాలనుందట. గాడిదను నేనెక్కడ తెచ్చేది.
భార్య: కాసేపు వీపున ఎక్కించుకుని తిప్పితే మీ సొమ్మేం పోతుంది.
భర్త: అంటే నేను..?????

Read more...

3 నవ్వులు

2, జనవరి 2010, శనివారం


ముచ్చటగా 3 సార్లునవ్వండి.

ప్రాసిక్యూటర్: ముద్దాయి ఎంతో తెలివిగా ఈ హత్యకు మాస్టర్‌ప్లాన్‌వేసి, చాకచక్యంగా పని పూర్తిచేశాడు.
ముద్దాయి: మీరు ఎంత పొగిడినా నేనీ నేరం ఒప్పుకోను.
తండ్రి: నీ వయసులో నాకు దేశ ప్రదానమంత్రులందరి పేర్లూ తెలుసు!
కొడుకు: అందులో గొప్పేముంది.. అప్పటికి ఇద్దరో ముగ్గురో ఉన్నట్టున్నారు.
టీచర్: సూరి దుస్తులకు నిప్పంటుకుంటే ఏం చేస్తావ్?
సూరి: వేసుకోను టీచర్.

Read more...

వంచి కొట్టండి

1, జనవరి 2010, శుక్రవారం


నాసా శాస్త్రవేత్తలు స్పేస్ షటిల్‌ను తయారు చేశారు. అంతా ఒకటికి రెండు సార్లు చెక్ చేశారు. అంతరిక్షంలొకి పంపే ముందు రాకెట్‌లొ సమస్య తలెత్తింది. శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా సమస్యను కనుక్కోలేక పోయారు.
ఆఖరికి భారత శాస్త్రవేత్త అయిన విహార్‌ను సహాయం కోరారు. ఆ ఏముందీ, రాకెట్‌ను కుడిపక్కకు నలభై అయిదు డిగ్రీల కోణంలో వాల్చండి. ఆతర్వాత ప్రయోగించండి చెప్పాడు భారత శాస్త్రవేత్త విహార్.
ఆయన చెప్పినట్లు చేయగానే రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నాసా శాస్త్రవేత్తలు ఆనందం పట్టలేకపోయారు.
ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది? విహార్‌ను అడిగారంతా.
ఆ.. ఏముందీ. మా దేశంలో స్కూటర్‌లు స్టార్ట్‌ కాకుంటే... మేమంతా చేసేది అదే కదా విడమరిచాడు విహార్.

Read more...

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.