హాస్యాంజలికి స్వాగతం...

చురక

31, అక్టోబర్ 2009, శనివారం



బస్సులో రద్ది ఎక్కువగా ఉంది. కాళ్ళు పెట్టడం కుడా కష్టంగా ఉన్నా ఏదోలా చొరపడ్డాడు రంగన్న చి..చి... దేశంలో ఉన్న జంతువులన్నీ యిక్కడోచ్చి చేరాయి. అని గొణిగాడు.
ఒక్క గాడిద తప్ప అన్ని ఉన్నాయనుకున్నాం మీ రాకతో లోటు కూడా తీరింది అని చురకేశాడో ప్రయాణికుడు.

Read more...

కొత్త భార్య

30, అక్టోబర్ 2009, శుక్రవారం


ఈశ్వరయ్య: పక్కింటి వెంక్కన్న ఏం తెచ్చిన నేను తీసుకురావాలని గొడవ పెట్టుకునే దానివి కదా. 29 అంగుళాల కలరు టివి, ప్రిజ్, సోఫాసేట్ తెచ్చేదాకా నా ప్రాణం తిశావ్. ఈసారి నువ్వు అడక్కుండానే నీ కోరిక తిర్చుదామనుకుంటున్నాను, ఉత్సాహంగా చెప్పాడు.
సంధ్యా: అంత హుషారుగా ఉన్నారు. ఇంతకి వెంక్కన్నగారు ఎం కొనుక్కోచ్చారు?
ఈశ్వరయ్య:ఏమి కొనలా. పాత భార్య ను వెళ్ళగొట్టి, కొత్త భార్య ను తీసుకొచ్చాడు.

Read more...

అవును.... అతనే

29, అక్టోబర్ 2009, గురువారం

బాస్: డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలని నిన్న సెలవు పెట్టినట్టున్నావు కదూ!
సెక్రెటరి: అవును సార్!
బాస్: మరైతే ఎవరితోనో సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తు కనిపించావ్!
సెక్రెటరి: అవును సార్.... అతనే మా డెంటిస్ట్.

Read more...

ఊహాచిత్రం

26, అక్టోబర్ 2009, సోమవారం


కమాండర్
సైనికులకు శిక్షణ ఇస్తున్నాడు. యుద్ధం జరుగుతున్నట్లుగా ఊహించండి, శత్రువు దాడి చేస్తున్నట్లుగా ఊహించండి... అంటూ ఒకటే పరుగులు పెట్టిస్తున్నాడు.
ఆయాసంతో రొప్పుతూ ఆగిపోయాడు శిక్షణ తీసుకుంటున్న విజయ్.
కమాండర్: ఎందుకు ఆగావ్? అరిచాడు.
విజయ్: ఆగలేదు సార్ చెట్టును ఊహించుకుని పొజిషన్ తీసుకుంటున్నాను సార్.

Read more...

నోటిM

25, అక్టోబర్ 2009, ఆదివారం

ముగ్గురు మిత్రులు కలిసి బారుకి వెళ్లారు. అక్కడ బారుగర్ల్ డాన్సు చేస్తుంది.ఆమె మొదటి వాడి వద్దకు రాగానే ఐదువందల నోటు తిసి ఆమె నోట్లో పెట్టాడు. మళ్లీ డాన్స్ కొనసాగింది. ఈసారి రెండోవాడి వద్దకు వచ్చిందామే, రెండోవాడు వెయ్యినోటు ఆమె నోట్లో పెట్టాడు. ఆ రెండు నోట్లు అలా నోటితో పట్టుకునే మూడోవాడి వద్దకు వచ్చింది. మూడో అతను జేబులోంచి ATM కార్డు తీశాడు. బారుగర్ల్ ముక్కుమీద దాంతో ఒకసారి గీసి ఆమె నోటిలోని పదిహేనొందలు తీసుకున్నాడు.

Read more...

ధీని భావమేమి వేంకటేశ?

వెంకటయ్య తన బార్యకు ఎన్నడు ఒక్క కొత్త నగ కొన్న పాపానపోలేదు.
వినోద ఆ విషయం నేరుగా అడగలేక ఒక ఉపాయం ఆలోచించింది.
ఏమండి
పెళ్లిరోజున మీరు నాకో వజ్రాలహారం కొన్నట్లుకల్లోచింది. దాని భావమేమిటంటారు? అని అనడిగింది.
వెంకటయ్య వచ్చాక చెబుతాలే అని వెళ్ళిపోయాడు .
సాయంత్రం ఓ ప్యాకేట్ని తీసుకొచ్చి బార్యకిచ్చాడు. తన ప్లాను పనిచేసిందని ఆమె ఎంతో ఆత్రుతగా, ఆనందంగా ప్యాకెట్ విప్పింది. అందులో ఓ పుస్తకం ఉంది. దాని పేరు కలలు-వాటి అర్ధాలు.

Read more...

నేరం నాది కాదు

24, అక్టోబర్ 2009, శనివారం


దొంగతనం నేరంకింద రమేశును కోర్టులో ప్రవేశపెట్టారు.తొమ్మిదినెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తిర్పుచేప్పాడు.
రమేశ్: ఇది దారుణం అని అరిచాడు.
న్యాయమూర్తి: ఈ బుద్ధి తప్పు చేసేముందు ఉండాలి ..
రమేశ్: అయినా ఒక్క కుడిచేయి చేసిన నేరానికి శరీరం మొత్తానికి శిక్ష వేయడం అన్యాయం కదా! పాయింటు లాగాడు.
న్యాయమూర్తి: చిన్నగా నవ్వి- సరే ....నువ్వు చెప్పినట్టే కానిద్దాం. నేను నీ కుడిచేతికి మాత్రమే శిక్ష వేస్తాను. శరీరాన్ని జైలుకు తెచ్చుకుంటావో లేదో నీ ఇష్టం అన్నాడు.
రమేశ్: చకచకా కృత్రిమ చేతిని ఊడదీసి అక్కడ పెట్టేసి భయటకు వెళ్ళిపోయాడు.

Read more...

ఆటోమేటిక్

23, అక్టోబర్ 2009, శుక్రవారం

అంజి: కార్లో స్పీడో మీటర్ లేదేంట్రా?
బుజ్జి: అక్కర్లేదని తీసి అమ్మేశా .
అంజి: మరి ఎంత వేగంగా వేలుతున్నావో ఎలా తెలుస్తుంది?
బుజ్జి: ఏముంది.... అరవైలో ఎగ్జాస్టు పైపు ఊగుతుంది. డెబ్బైలో డోరు ఊగుతుంది. ఎనబైలో నేనే ఊగుతాను.

Read more...

పరమార్థం

21, అక్టోబర్ 2009, బుధవారం

రామారావు పేకాటలో నిండా మునిగిపోయాడు. రాత్రిలేదు పగలు లేదు... భార్యాపిల్లల పట్టింపు లేదు. పరిస్థితి చేయిదాటిందని వాళ్ళావిడ తన సోదరుడికి కబురు పెట్టి పిలిపించింది.
బావమరిది: చూడు భావా.... పేకాటలో డబ్బులు ఇవ్వాల వస్తాయి. రేపు పోతాయి ఎల్లుండి వస్తే, అవతలెల్లుండి మళ్లీ పోతాయి. ఇది మాయదారి ఆట.... అని తన బావ రామారావుకు నెమ్మదిగా చెబుతున్నాడు.
రామారావు: సర్లే యింతకి నువ్వు చెప్పేదేమిటి.... రోజు విడిచి రోజు ఆడమంటావు....అంతేగా!

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.