కాకి గోల
21, అక్టోబర్ 2010, గురువారం
ప్రణిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
ప్రణిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది.
గమనిక: దయచేసి ఆడవాళ్ళు సరదాగ తీసుకొండి.
Read more...
"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు హరికోటి పండ్లు అమ్మేకుర్రాడిని.
"ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను.
"ముప్పావలాకిస్తావా?"
"ముప్పావలాకు తొక్కవస్తుంది."
"సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు హరికోటి.
భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్ టానిక్ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..
రమేష్: "రాధా రాధా.... మన బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు.
రాధ: "అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది.
"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.
"సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.
"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.
మోహన్: మన వంశం ఎంత గొప్పదో తెలుసా! మా నాన్న పులిలా బ్రతికాడు. నేను అంతే. నువ్వు కూడా పులిబిడ్డలా బ్రతకాలి. సరేనా కొడుకుతో అన్నాడు.
కొడుకు: 'నిజమే నాన్న! అమ్మ కూడా ఇదే చెప్పింది'
మోహన్: 'ఎం చెప్పింది'
కొడుకు: 'నువ్వు మనిషివి కాదూ మృగానివని....'
కిశోర్: పెళ్ళయిన కొత్తలో ఇంట్లోకెళ్ళి బూట్లు విప్పుతూ ఉండగానే నా భార్య ప్రేమతో కాఫీ పట్టుకోచ్చేది. అప్పట్లో వాళ్ల కుక్క మాత్రం నన్ను చూడగానే అరుస్తూ ఉందేది. కాని ఇప్పుడంతా రివర్స్. ఆ కుక్క కాఫీ పట్టుకొస్తే ఆమె అరుస్తోందని సైకాలజిస్టుతో కష్టాలు చెప్పుకుంటున్నాడు .
సైకాలజిస్టు: చేసేవాళ్ళు మారినా అప్పుడూ ఇప్పుడూ మీకు చేసే సేవల్లో తేడా లేదు కదా. మరి సమస్యేమిటి? అడిగాడు.
ఏ
మండీ.... మనమ్మాయి పెన్సిల్ మింగేసింది ఆందోళనగా చెప్పింది శ్రీదర్ భార్య. ముందే రెండు పెన్సిళ్ళు కొందామంటే విన్నావు కావు. ఇప్పుడు నేను వెళ్లను, కావాలంటే నువ్వే వెళ్లి తెచ్చుకో చిరాగ్గా అన్నాడు శ్రీదర్.
కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బె.. ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అని అరిచాడు.
"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.
బరువు చూసుకునేందుకు వెయింగ్ మెషిన్ ఎక్కింది శిల్ప. రూపాయి నాణెం వేయగానే 50 కిలోలు అని చూపించింది.
తర్వాత తన హై హీల్స్ తీసేసి నాణెం వేసింది. ఈసారి 48 అని వచ్చింది.
స్వెట్టర్ తీసేసి మళ్ళి కాయిన్ వేసింది. ఈదఫా 46 వచ్చింది. చేతిలో చూసుకుంటే అప్పటికే రూపాయి బిళ్ళలు అయిపోయాయి.
బరువు చూసుకునేందుకు వచ్చి ఇదంతా చూస్తున్న శశికాంత్ ఆత్రుతగా అన్నాడు... కాయిన్స్ నేను వేస్తుంటానులెండి, మీరు కానివ్వండి, ఆపకండి...
అందుకు శిల్ప ఇలా అంది ముందు నినే వేస్తాను అని శశికాంత్ చెంపపై లాగి కొట్టింది.
వివేక్: దేవితో ఏమీ మాట్లాడలేకపోతున్నాన్రా బాధగా చెప్పాడు స్నేహితుడితో
స్నేహితుడు: అమ్మాయిలతో మాట్లాడడం ఓ ఆర్టు. 1.ఆహారం, 2.కుటుంబం, 3.తర్కం... వీటి చుట్టూ నీ సంభాషణ ఉండేట్టు చూసుకో... ఎంతసేపైనా మాట్లాడతారు సలహా ఇచ్చాడు.
వివేక్‌కి ఓ రోజు దేవితో మాట్లాడే అవకాశం దొరికింది.
వివేక్: మీకు పిజ్జా ఇష్టమా? (1.ఆహారం)
దేవి: లేదు.
వివేక్: సంభాషణ ఎలా కొనసాగించాలో తెలియక, మీకు తమ్ముడున్నాడా? అన్నాడు ( 2.కుటుంబం).
దేవి: లేడు.
వివేక్: చివరి అస్త్రంగా తర్కాన్ని ప్రయొగించాడు. ఒకవేళ మీకు తమ్ముడు ఉండి ఉంటే, అతడికి పిజ్జా అంటే ఇష్టం ఉండేదా?
దేవి: !!!!!!!!!!!!!!
కిట్టు: కోపం, బాధ రెండూ తగ్గడానికి మందులేమైన ఉన్నాయా మెడికల్ షాపతన్ని అడిగాడు.
మెడికల్ షాపతడు: ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు? అని అడిగాడు.
కిట్టు: ఇంకెవరికి, మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి అని చెప్పాడు.
సూరమ్మ: ఈ రోజు మీ ఇంట్లో టమాట కూర చేశారు కదూ వదినా?
మణెమ్మ: "అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
సూరమ్మ: రాత్రి మా దొడ్లో టమాటలు ఎవరో దొంగవెధవలు కోసుకెళ్ళార్లే
పోలీసు నారాయణ: ఏంటయ్యా నా ప్యాంట్‍కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు టైలర్‍తో.
టైలర్: "పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు.
విఠల్‌రావు పేపరు చదువుతున్నాడు. భార్య పక్కనే నిల్చుంది. వాళ్ల ముందు ప్రోగ్రెస్ కార్డు పెట్టేసి చప్పున జారుకున్నాడు కొడుకు.
మనవాడి మార్కులు చూసారా? ఆరువందల మార్కులకు మొత్తం కూడిన వంద రావట్లేదు. వాడి చదువు చూస్తుంటే కంగారుగా ఉందండీ అంది భార్య.
ఒక్క విషయానికి మాత్రం ఆనందంగా ఉంది అన్నాడు విఠల్‌రావు.
ఎందుకు?
వాడు ఎవరిదగ్గర కాపీ కొట్టలేదనేది కచ్చితం.
శీను: ఏంటీ, నువ్వు ఏమన్నా సరే మీ ఆవిడ దించిన తల ఎత్తడం లేదా! వింతగా ఉందే, ఏం మంత్రం వేశావ్? ఆశ్చర్యంగా అడిగాడు.
వేను: తలెత్తినప్పుడు యాబై ఏళ్ల మనిషిలా తలదించుకుంటే ఇరవై ఏళ్ల అమ్మాయిలా ఉన్నావని చెప్పా, అంతే.
ఈ పేజి మొదటికి వెళ్ళండి.