పంచావతారం
30, నవంబర్ 2009, సోమవారం

నగేష్ చెకప్ కోసం వెటర్నరి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు.
డాక్టర్: చూడు మిస్టర్.... మీరు వెళ్లాల్సింది నా ఎదురుగ్గా ఉన్న క్లినిక్కు సూచించాడు.
నగేష్: లేదు డాక్టర్.... నేను మీ కోసమే వచ్చాను.
డాక్టర్: ఇదిగో.... నువ్వు నాలా మాట్లాతున్నావు. నీ బాధేంటో చెప్పుకోగలుగుతున్నావు. అంటే నువ్వు మనిషివి. కానీ నేను పశువులకు వైద్యం చేసే డాక్టర్నే.
నగేష్: ఆ విషయం తెలిసే వచ్చాను
డాక్టర్: ఎందుకనీ?
నగేష్: ఎందుకంటే... పొద్దున్నే గుర్రంలాగా పరుగెత్తుకుని ఆఫీసుకు వెళ్ళాను. రోజంతా గాడిదలా పనిచేస్తాను. బాస్ పిలిచినప్పుడల్లా కుక్కలా తోక ఊపుతాను. రాత్రి ఇంటికి వచ్చి నా భార్యను చూడగానే పిల్లినైపోతాను......





















