హాస్యాంజలికి స్వాగతం...

ప్రతిబింబం

14, నవంబర్ 2009, శనివారం


అద్దం కొత్తగా వచ్చిన రోజులు. పోలంనుంచి వస్తున్న సుబ్బయ్యకు దారిలో ఓ అద్దంముక్క దొరికింది. అందులో ఉన్నది ఎవరో ఆయన గుర్తుపట్టలేదు. చనిపోయిన తన తండ్రి అలా కనిపిస్తున్నాడని భ్రమపడ్డాడు. ఆ అద్దం ముక్కను ఇంట్లో ఓచోట దాచిపెట్టి రోజు ఆయనకు అవి ఇవి కబుర్లు చెబుతుండేవాడు.
సుబ్బయ్య
ధోరణితో భార్యకు అనుమానం వచ్చింది. ఆయన పొలానికి వెళ్ళినప్పుడు తిసిచూస్తే ఏముంది? అందులో 30 ఏళ్ళ అందమైన స్త్రీ కనిపించింది. అంతే! భర్తకు ఎవరితోనో సంబంధముందని ఆవిడ లబోదిబోమంది పక్కింటి పార్వతమ్మను పిలిచి- ఆయనేలాంటి పనిచేశారో చూడు అని కన్నీరు పెట్టుకుంది.
ఏది చూద్దామని పార్వతమ్మ అద్దం చేతిలోకి తీసుకొని- ఏయ్ పిచ్చిమొహమా.... ఇంత ముసలావిడతో మీ ఆయన తిరుగుతున్నాడని ఎట్లా అనుకుంటావే.... ఎవరైనా వింటే నవ్విపోతారు అంది.

Read more...

బాలలదినోత్సవ శుభాకాంక్షలు

చిన్నారి హాస్యాభిమానులకు "బాలలదినోత్సవ మరియు నెహ్రూ జయంతి" శుభాకాంక్షలు

Read more...

అసలు పేరేమిటి?

10, నవంబర్ 2009, మంగళవారం


బబ్బులు కారు గోతిలో చిక్కుకుంది.
దగ్గరలోని
గుర్రలశాల నుంచి ఓ గుడ్డిగుర్రాన్ని తీసుకొచ్చి కారుకు కట్టాడు అక్కడి వ్యక్తి. కమాన్.... లోటస్.. ఊఁ.... లాగెయ్ రిక్కీ.... నువ్వు కూడా....
డార్కి.... ఊపిరి బిగబట్టి ఒక్క ఊపులో హుపుమంటూ లాగాలి
గుర్రం ఒక్క ఉదుటున లాగగానే కారు బయటకు వచ్చేసింది.
థాంక్స్ ఒక్క గుర్రానే అన్నీ పేర్లతో పిలిచారు. ఇంతకీ దాని అసలు పేరేమిటి? అని అడిగాడు బబ్బులు.
దాని పేరు లోటసే. మిగతావన్నీ దాని తోటి గుర్రాలు. ఇది గుడ్డిదైనా భలే తెలివైనది. పనైనా తానొక్కతే ఎందుకు చెయ్యాలని తెగ పంతం దానికి చెప్పాడా వ్యక్తి.

Read more...

అందరికి ఆహ్వానం

9, నవంబర్ 2009, సోమవారం

(దయచేసి పూర్తిగా చదవండి)
తెలుగు భాషాభిమానులందరికీ స్వాగతం. నా చదువు ఇంగ్లీష్ మీడియం అయినా నేను, తెలుగు భాషాభిమానినే అలాగని తెలుగులో పండితున్ని కాదు పామరున్ని మాత్రమే అందుకే అచ్చు తప్పులు దొర్లితే తెలుగువారు మన్నించాలి.
తెలుగు భాషంటే నాకెంతో అభిమానము అలాగని ఇంగ్లీష్ మరియు ఇతర భాషలంటే ఎలాంటి ద్వేశమూ లేదు కన్న తల్లి లాంటిది కాబట్టే పుట్టిన తరువాత మాట్లాడే భాషను మాతృభాష అని పిలుస్తారు. భార్యలాంటిది ఆంగ్లభాష అని నేననుకుంటాను.
నా ఉద్దేశంలో భార్యకోసం తల్లిని, తల్లికోసం భార్యని చులకన చేయడం తప్పిదమే ఔతుంది. మనమంటూ ఉన్నామంటే దానికి కారణం తల్లి, మనం మాటలు నేర్చుకోడానికి కారణం మాతృభాష. తల్లి తరువాత మనకోసం తపించేది భార్య, మనం రాష్ట్రాలు, దేశాలు దాటి మన తెలుగువారి ఖ్యాతిని పెంచడానికి ఆంగ్లభాష అవసరముంటుంది. కన్నతల్లి, కట్టుకున్నభార్య ఇద్దరూ రెండు కల్లలాంటివారు ఇద్దరూ సమానమేకదా.
నా మొదటి తెలుగు బ్లాగు రాంగోపాల్స్ బ్లాగులో సామాజిక విషయాలపై వ్రాసాను సమయం చిక్కకపోవడంవల్ల ఎక్కువ టపాలు వ్రాయలేకపోతున్నాను త్వరలోనే అందులో టపాలు వ్రాస్తాను.
నా రెండో తెలుగు బ్లాగు మీరు చూస్తున్న హాస్యాంజలి నేను విన్నా, చదివిన జోకులను ఇక్కడ వ్రాస్తున్నాను సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు. కొందరికి హాస్యమన్న హాస్యాన్ని గురించి మాట్లాడడమన్న అపహాస్యంగా ఉండవచ్చు. నా దృష్టిలో నవ్వు భాధలను తరిమికొట్టే టానిక్. అది మనిషికి మాత్రమే ఉన్న గొప్పవరం. "నవ్వుతూ బ్రతకాలి నవ్వుతూ చవాలనేదే నా కోరిక" మనం సంతోషంగా ఉంటేనే ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతాం.
తెలుగు భాష ఒకరి సొత్తు కాదు అలాగే తెలుగు హస్యాం ఒకరి సొత్తు కాదు. నేను విన్న జోకులను అందరితోని పంచుకొని వారిని కొంతైనా సంతోషపరచాలని బ్లాగుని రూపొందించాను. అలాగే ప్రతి ఒక్కరు హాస్యాన్ని అనుభవపూర్వకంగానో ఎక్కడైనవినో చదివో నవ్వుకొనే ఉంటారు. నవ్వురానివారికి మనమేమిచేప్పలేము అది manufacture defectఅని అనుకోవాలంతే. కాని జోకులు విని నవ్వుకున్న వారు, నవ్వంటే ఇష్టమున్న ప్రతి ఒకరు ఒక హాస్య బ్లాగ్ని క్రియేట్ చేస్తే, ఇంటర్నెట్ మొత్తం హాస్యబ్లాగులతో నిండిపోతుంది. అందుకే నాకో చిన్న ఆలోచన తట్టింది ధీన్ని పెద్ద మనసుతో అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను.
మీకు తెలిసిన జోకులతోపాటు, మీ బ్లాగ్ URL లేదా ఈమెయిల్ ఐడిని కామెంటు బాక్సులోరాయండి. దానికి తగిన animation జతచేసి మీ పేరు మరియు మీ బ్లాగ్ లంకేతో కొత్త టపాగా ప్రచురిస్తాను. మీకు నచ్చితే వెంటనే జోకు రాయడం ప్రారంభించండి.
ఇంటర్నెట్ సెంటేరుకేల్లి అప్పుడప్పుడు బ్లాగులు చూసే వారికోసమని టపాను రిపీట్ చేస్తాను. రోజు నెట్లో విహారించేవారు దయచేసి విసుక్కోకండి.

"నవ్వేజనా సుఖినోభవంతు"

Read more...

అమ్మ కాదంది

8, నవంబర్ 2009, ఆదివారం


ఆరేళ్ల శ్వేతని ఎవరైనా పేరు అడిగితే నేను ప్రకాశ్ గారి అమ్మాయినని చెప్పసాగింది.
అది గమనించిన తల్లి, అలా చెప్పకూడదు నానా, నా పేరు శ్వేతా అని చెప్పాలి' అని చెప్పింది.
ఓ రోజు శ్వేతని స్కూల్లో చూసిన ఓ వ్యక్తి, నువ్వు ప్రకాశ్ గారి అమ్మాయివి కదూ? అనడిగాడు.
నేను
అదే అనుకున్నాను. కాని మా అమ్మ కాదని చెప్పింది! అంది భారంగా నిట్టూర్చుతూ.

Read more...

చివరి కోరిక

7, నవంబర్ 2009, శనివారం

విక్రంకి ఓ హత్య కేసులో కోర్టు మరణశిక్ష విధించింది. అతడిని ఎలక్ట్రిక్ చెయిర్లో కూర్చోబెట్టారు.
పోలీస్ అధికారి: నీ చివరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగాడు.
విక్రం: నాకు భయంగా ఉంది. కాస్త నా చేయి పట్టుకుంటారా.

Read more...

'కార్తీక పౌర్ణమి' శుభాకాంక్షలు

2, నవంబర్ 2009, సోమవారం

హాస్యాభిమానులకి 'కార్తీక పౌర్ణమి' శుభాకాంక్షలు

Read more...

మంచి సంబంధం

మీనా: అమ్మాయి పెల్లిడుకోచ్చింది... మీకు చిమకుట్టినటైన లేదు రుసరుసలాడింది భర్త పైన .
భర్త: చేద్దాంలే.... అప్పుడే ఏంటి తొందర సంబంధం రావొద్దు' తాపిగా బదులిచ్చాడు వెంకట్.
మీనా: ... మంచి సంబంధం అని మీరు అలాగే పొద్దుపుచ్చండి... అయిన నాకు తెలియకడుగుతాను.... మంచి సంబంధమే కావాలని మా నాన్న కూడా పట్టుబట్టి ఉంటే మన పెళ్లి జరిగేదేనా' పాయింటు లాగింది మీనా.

Read more...

యాపిల్ జ్యూస్

1, నవంబర్ 2009, ఆదివారం

ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: మేడం ది యురిన్ శాంపిల్ కాదు. యాపిల్ జ్యూస్ వెంకాయమ్మతో చెప్పాడు .
వెంకాయమ్మ: అయ్యో లాగా నేను అర్జంటుగా ఒక పోను చేసుకోవచ్చా.
ఆసుపత్రి ల్యాబు అసిస్టెంటు: ఎవరికి మేడం?
వెంకాయమ్మ: ఇంకెవరికి మా ఆయనకి. ఆయన లంచుబాక్సులో యాపిల్ జ్యూస్ బాటిలుకు బదులుగా యురిన్ శాంపిల్ బాటిల్ పెట్టుంటా ఆందోళనగా చెప్పింది .

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.