హాస్యాంజలికి స్వాగతం...

ఎవరు గొప్ప

13, మార్చి 2010, శనివారం

టీ తాగడానికి సూరి 'చంద్రం టీ కొట్టుకు' వెళ్ళాడు. అక్కడ చంద్రం తన గొప్పలు చెప్పుకుంటున్నాడు.
టీ కొట్టు చంద్రం: బిల్‌గేట్స్‌కు ఉన్నంత డబ్బు సంపాదించి అంతకన్నా గొప్పవాణ్ణి అవుతా
సూరి: గేట్స్‌కు ఉన్నంతే సంపాదిస్తే అతడూ నువ్వూ సమానం మాత్రమే అవుతారు కదా? అంటూ అనుమానంగా అడిగాడు.
టీ కొట్టు చంద్రం: బిల్గేట్స్కు నాలా టీ కొట్టు లేదుగా అందుకని నేనే గొప్ప అని బడాయిగా చెప్పాడు.

Read more...

వాళ్లబ్బాయికి పదేళ్లు

9, మార్చి 2010, మంగళవారం

పండక్కి మంచి సూట్‌ కుట్టిచాలని ఖరీదైన బట్ట కొన్నాడు వీరేశం. దాన్ని తీసుకుని వాళ్ల వీదిలో
ఉన్న టైలర్‌ దగ్గరికి వెళ్లాడు.
బట్టను టేపుతో కొలిచి ఇది సరిపోదు సార్‌.... మీకు చిన్నదవుతుంది పెదవి విరచాడు దర్జీ.
అతడి మాటను నమ్మాలనిపించక మరో టైల‌ దగ్గరికి వెళ్లాడు వీరేశం. బట్టను కొలిచి సంత్రప్తిగా
తలూపాడు
రెండోదర్జీ.
వారంరోజుల తర్వాత సూట్‌ తెచ్చుకుందామని వెళ్లిన వీరేశానికి దర్జీ ఐదేళ్ల కొడుకు కనిపించాడు.
వాడికీ తన బట్టలోనే డ్రెస్‌ కుట్టినట్టు గమనించాడు.
నేనిచ్చిన బట్టలో నాకు సూట్‌ కుట్టావు, అందులో మిగిలిందానితో నీ కొడుక్కు కుట్టుకున్నావు.
సరే, నీమీద నాకు కోపంలేదు. నాకు అర్దం కానిదల్లా ఆపక్క వీది దర్జీ బట్ట సరిపోదని ఎందుకు
చెప్పాడు ఆశ్చర్యంగా అడిగాడు వీరేశం.
అదా.... వాళ్లబ్బాయికి పదేళ్లు సార్‌....

Read more...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

8, మార్చి 2010, సోమవారం

Read more...

పాత నెట్‌వర్క్

5, మార్చి 2010, శుక్రవారం


రోహిత్ రోడ్డుమీద వెళ్తుంటే ఓ కుక్క అతని వెనుకే వెళ్తోంది. దాన్ని గమనించిన రోహిత్ నవ్వుకుంటున్నాడు.
ఎందుకు నవ్వుతున్నావు? అనిక్కనే ఉన్న మిత్రుడు డిగాడు.
నేను మొన్ననేయిర్‌టెల్‌ నంబర్‌ తీసుకున్నా. కానీ ఇప్పూడూ నా పాత నెట్‌వర్క్‌ ఫాలో అవుతుంటేనూవ్వుతూనే చెప్పాడు రోహిత్.

Read more...

హాస్యాభిమానులకు హోళి శుభాకాంక్షలు

1, మార్చి 2010, సోమవారం

Read more...

అడ్డుగా నిచ్చెన

20, ఫిబ్రవరి 2010, శనివారం

పింకీ: అమ్మా, హాల్లో అడ్డంగా నిచ్చెన ఎవరు పెట్టారు? అది నా మీద పడింది.
అమ్మా: నేను వంట చేస్తున్నా, అక్కడే మీ నాన్న ఫ్యాన్‌ బాగుచేస్తుంటారు చూడు. దెబ్బలేమయిన తగిలితే మందు రాయించుకో!
పింకీ: ఎంత పిలిచినా ఫ్యాన్‌ రెక్కలు పట్టుకొని వేలాడుతున్నారే గానీ వాటిని వదిలి దిగడం లేదు. నువ్వే రా!

Read more...

ఈ ప్రశ్న క్యాన్సిల్...

17, ఫిబ్రవరి 2010, బుధవారం

గొపి: ఓరేయ్‌ రాజూ, నీ దగ్గర రెండు సెల్‌పోన్లు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా?
రాజు: అదేంట్రా అలా అడుగుతున్నావు. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటీ!
గొపి: నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా?
రాజు: ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండడానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను
గొపి: నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా?
రాజు: ఏరా నీకింకా నమ్మకం కలగలేదా.
గొపి: రెండు కలర్‌ టీవీలుంటే....
రాజు: నా దగ్గర రెండు కలర్టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావు... ప్రశ్న క్యాన్సిల్.

Read more...

బిల్లు మోగింది

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఫోన్‌ బిల్‌ చూసి బిత్తరపోయిన రామరాజు ఇంట్లో వాళ్లని పిలిచి ఎవరు ఇన్ని కాల్స్‌ చేశారని నిలదీశాడు.
కొడుకు: నేను ఆఫీస్‌ ఫోన్‌ మాత్రమే వాడతాను.
భార్య: ఫోన్‌ అవసరముంటే మా మేనేజర్‌ గారి అకౌంట్లోనే!
పనిమనిషి: మీరంతా ఆఫీసుల్లోనే ఫోన్లు చేసుకుంటున్నారు కదాని నేను ఈ ఫోన్‌ వాడుతున్నాను.
మరి నాకు ఆఫీస్అంటే మీ ఇల్లే కదా!

Read more...

రహస్య కెమెరాలు

15, ఫిబ్రవరి 2010, సోమవారం


టీవీ చూస్తున్న రఘురాం ఉన్నట్లుండి గదిలో మూలమూలా వెతుకుతున్నాడు.
ఎందుకు వెతుకుతున్నారు అని భార్య అడిగింది.
రహస్య కెమెరాల్ని అన్నాడు రఘురాం.
ఏంటీ ? అంది తన భార్య.
నేను హాస్యాంజలి చానల్‌ చూస్తున్నానా. ఇందాకటి నుంచీ మీరు చూస్తున్నది హాస్యాంజలి చానల్‌ అని ఆ
యాంకర్‌ నా వంక చూస్తూ చెబుతోంది నేనేం చూస్తున్నానో ఆమెకెలా తెలుస్తుంది. తప్పకుండా
ఇక్కడెక్కడో రహస్య కెమెరాలు ఉండే ఉంటాయ్‌ వెతుకుతూనే చెప్పాడు రఘురాం.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.