హాస్యాంజలికి స్వాగతం...

వాళ్లబ్బాయికి పదేళ్లు

9, మార్చి 2010, మంగళవారం

పండక్కి మంచి సూట్‌ కుట్టిచాలని ఖరీదైన బట్ట కొన్నాడు వీరేశం. దాన్ని తీసుకుని వాళ్ల వీదిలో
ఉన్న టైలర్‌ దగ్గరికి వెళ్లాడు.
బట్టను టేపుతో కొలిచి ఇది సరిపోదు సార్‌.... మీకు చిన్నదవుతుంది పెదవి విరచాడు దర్జీ.
అతడి మాటను నమ్మాలనిపించక మరో టైల‌ దగ్గరికి వెళ్లాడు వీరేశం. బట్టను కొలిచి సంత్రప్తిగా
తలూపాడు
రెండోదర్జీ.
వారంరోజుల తర్వాత సూట్‌ తెచ్చుకుందామని వెళ్లిన వీరేశానికి దర్జీ ఐదేళ్ల కొడుకు కనిపించాడు.
వాడికీ తన బట్టలోనే డ్రెస్‌ కుట్టినట్టు గమనించాడు.
నేనిచ్చిన బట్టలో నాకు సూట్‌ కుట్టావు, అందులో మిగిలిందానితో నీ కొడుక్కు కుట్టుకున్నావు.
సరే, నీమీద నాకు కోపంలేదు. నాకు అర్దం కానిదల్లా ఆపక్క వీది దర్జీ బట్ట సరిపోదని ఎందుకు
చెప్పాడు ఆశ్చర్యంగా అడిగాడు వీరేశం.
అదా.... వాళ్లబ్బాయికి పదేళ్లు సార్‌....

2 చిరు నవ్వులు:

మధురవాణి 9 మార్చి, 2010 7:51:00 PM  

హహ్హహ్హా..very good one!! :-)

అజ్ఞాత,  11 మార్చి, 2010 8:12:00 PM  

Hahahaha Chaala bagundi....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

హాస్యాంజలికి వచ్చినవారు దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయండి.

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.