హాస్యాంజలికి స్వాగతం...

స్కూలులో ఎవరంటే ఇష్టం?

27, సెప్టెంబర్ 2012, గురువారం

"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.

Read more...

1547 B.C.

29, ఆగస్టు 2012, బుధవారం


ఓ లారిడ్రైవర్, క్లీనర్ మ్యూజియం చూడడానికి వెళ్లారు. అక్కడో అస్థిపంజరం వేలడదిసి ఉంది. దాని కింద 1547 B.C. అని రాసి ఉంది. ఎంట్రోయ్ మొన్న లారి కిందపడి చచ్చిపోయినోడు ఈడేనా గుసగుసగా అన్నాడు డ్రైవర్. అవునవును..... లారినేంబరు కూడా రాశారు అని డ్రైవర్ను బయటకి లాక్కొచ్చాడు క్లీనర్.

Read more...

అర్జెంట్‌

18, ఆగస్టు 2012, శనివారం

తొందరగా రొండో అంతస్తుకి వెళ్లి ఆ పైల్‌ తీసుకురా బాయ్‌తో అన్నాడు పదో అంతస్తులో మీటింగ్‌లో ఉన్న రమేష్‌.
అర్ధ గంట తరువాత అలసిపోయి వచ్చాడు బాయ్‌.
అర్జెంట్‌గా రమ్మంటే ఇంత ఆలస్యమా... ఏం జరిగింది అని అడిగాడు రమేష్‌.
తొందరగానే లిప్ట్‌ దగ్గరికి వెళ్లాను సార్‌. కానీ లిప్ట్‌లో ఎమర్జెన్సీలో పక్కనున్న నిచ్చెనను
ఉపయెగించండి అని రాసుంది. అందుకే......

Read more...

కాకి గోల

21, అక్టోబర్ 2010, గురువారం

అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
ప్రణిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
ప్రణిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది.


గమనిక: దయచేసి ఆడవాళ్ళు సరదాగ తీసుకొండి.

Read more...

తొక్కలో పండు

14, ఆగస్టు 2010, శనివారం

Bananagrams Jumbo"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు హరికోటి పండ్లు అమ్మేకుర్రాడిని.

"ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను.

"ముప్పావలాకిస్తావా?"

"ముప్పావలాకు తొక్కవస్తుంది."

"సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు హరికోటి.

Read more...

మగవాళ్ళకు మాత్రమే

12, ఆగస్టు 2010, గురువారం

స్త్రీలను అర్ధం చేసుకోవడం మహాకష్టం...

* వాళ్ళ అందాన్ని పొగిడితే అబద్ధం ఆడుతున్నామంటారు, పొగడకపోతే సౌందర్య దృష్ఠి లేదంటారు.
* చెప్పిందానికల్లా ఒప్పుకుంటే డూడూ బసవన్నని వెక్కిరిస్తారు. ఒప్పుకోకపోతే అర్థం చేసుకునే మనసు లేదంటారు.
* ఎక్కువ మాట్లాడితే "బోర్" అంటారు, మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు.


గమనిక: దయచేసి ఆడవాళ్ళు సరదాగ తీసుకొండి.

Read more...

తుప్పు

10, ఆగస్టు 2010, మంగళవారం

Fever-Tree Naturally Light Tonic Water, 6.8-Ounce Bottles (Pack of 24)భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్టానిక్వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..

Read more...

వారు వీరైతే?

25, జులై 2010, ఆదివారం

Treason (Navy Justice, Book 1)
రామేశం: "ఇదేంట్రా నిన్నటి పేపర్ ధర్జగా చదువుతున్నావు?" అడిగాడు. 
కామేశం:  "ఇదివరుకుట్లా  పేపర్ కొనడం మానేశానోయ్. ప్రతి రోజు పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు.
రామేశం: "మరి   పేపర్ ఎవరిది?"
కామేశం: "పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."
రామేశం: అంటే ఇకనుండి........ 

Read more...

తెలివితేటలు

23, జులై 2010, శుక్రవారం

Fisher-Price Brilliant Basics Baby's First Blocksరమేష్: "రాధా రాధా.... బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు.
రాధ: "అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.