హాస్యాంజలికి స్వాగతం...

చేతకాదూ

31, డిసెంబర్ 2009, గురువారం

సేల్స్ మెన్ కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది.
అధీకారి: మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా?
శ్రీకాంత్: లేరు.
అధీకారి: ఇప్పటివరకూ మీరు ఎవరినైనా ప్రేమించారా లేదాఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా?
శ్రీకాంత్: అబ్బే లేదండీ.
అధీకారి: అంటే, ముందు ఉద్యోగం తెచ్చుకుని తరవాత ప్రేమించాలనుకుంటున్నారా?
శ్రీకాంత్: నాకు కెరియరే ముఖ్యం. తరవాతే ప్రేమాగీమా. అయినా అమ్మాయిల వెనక తిరగడం, కబుర్లు చెప్పడం... ఇవన్ని నాకు చేతకాదులెండి.
అధీకారి: సారీ, మీకీ ఉద్యోగం ఇవ్వడం మాకు చేతకాదూ. ఎందుకంటే కమ్యూనికెషన్ స్కిల్స్ లేవు. మీమీద మీకు నమ్మకం కూడా లేదు. ఇప్పటివరకు ఒక్క అమ్మాయిని కూడాప్రేమలో పడేయలేనివాళ్లు మా ఉత్పత్తుల్ని ఎలా అమ్ముతారు? you can go.

Read more...

ఇంకా నయం

30, డిసెంబర్ 2009, బుధవారం


భార్గవి: హిప్నాటిస్ట్‌ని చేసుకోవడం తప్పైపోయింది బాధపడుతూ చెప్పింది.
సుశీల: ప్రేమించి మరీ చేసుకున్నావ్‌గా, ఏమైందే? అని అడిగింది కాఫీ తాగుతూ.
భార్గవి: నన్ను హిప్నటైజ్‌ చేసి, నేను ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బుల వివరాలన్నీ నాతోనేచెప్పించి, ఖాళీ చేసేస్తున్నాడే.
సుశీల: నయం కదూ.... పక్కవీధిలోని పద్మావతి వాళ్లాయన గురించి మీవారికి ఇంకా తెలిసినట్టులేదు.
భార్గవి: ఆయన ఏం చేస్తాడేం?
సుశీల: వాళ్లావిణ్ణి హిప్నటైజ్చేసి, అంట్లు కూడా తోమిస్తున్నాడు.
భార్గవి: దీన్ని బట్టి చూస్తే మా ఆయనే నయమనిపిస్తుందే సుశీల.

Read more...

ఇంటి దొంగ

29, డిసెంబర్ 2009, మంగళవారం





కోపంగా వంటింట్లొకి వచ్చాడు ప్రకాష్.
ఏమైంది..... పొద్దున్నే మొఖం అలా పెట్టారు? అడిగింది వాళ్ళావిడ విద్య.
ప్రకాష్: నీ సుపుత్రుడు.... మళ్లీ నా జేబులోంచి డబ్బులు తీసుకెళ్ళాడు.
విద్య: వాడిమీద మీకెందుకండి అంత అనుమానం... అయినా వాడే తిశాడనేముంది.... నేను కూడా తీసి ఉండొచ్చుగా!
ప్రకాష్: నువ్వు కాదులే....
విద్య: మీకెలా తెలుసు?
ప్రకాష్: జేబులో ఇంకా రెండొందలున్నాయి.

Read more...

అటెన్షన్

25, డిసెంబర్ 2009, శుక్రవారం


మా వినయ్ కి పరీక్షల్లో అన్నీ సున్నాలే వచ్చినా కొట్టడానికి వీలు కావడం లేదురా ఆర్మీలో జవాన్ గా చేస్తున్నా సతీష్ అన్నాడు వంశీతో.
వంశీ: ఏం ఎదురు తిరుగుతున్నాడా?
సతీష్: కొట్టడానికి చేఎత్తినప్పుడల్లా జాతీయగీతం పాడుతున్నాడు. నేనేమో సెల్యూట్ చేసి అటెన్షన్ లో నిలబడాల్సి వస్తోందని వాపోయాడు.

Read more...

హాస్యాభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు


Read more...

సోమ,మంగళ,బుద.......

24, డిసెంబర్ 2009, గురువారం


పనిపిల్లను తిడుతోంది గృహిణి.
ఇదుగో
ఇవ్వాళ సోమవారం మధ్యాహ్నం. కళ్లు మూసి తెరిచేలోపు మంగళవారం వస్తుంది, ఇక బుధవారం రావడం ఎంతసేపు? వారంలో సగం రోజులు అయిపోయినాయి...... ఎక్కడి పని అక్కడే ఉంది, త్వరగా కానియ్ మొద్దుమొహమా.

Read more...

తమ్ముడో

23, డిసెంబర్ 2009, బుధవారం


విన్ని: డాడి, ఇందాక ట్రైన్ ఆగింది కదా అది ఏ స్టేషన్?
డాడి: పుస్తకం చదువుతున్నాకదా ఎందుకు డిస్టర్బ్ చేస్తావు వచ్చేటప్పుడు చూద్దాంలే.
విన్ని: మరి అంతవరకూ తమ్మూడు ఆ ఊళ్లో ఎవరి దగ్గర ఉంటాడు?

Read more...

అన్నింటా నువ్వేనా

22, డిసెంబర్ 2009, మంగళవారం

మీకు ఇప్పటికే మందెక్కువయింది. ఇంటికి వెళండి… మరో ఫుల్ బాటిల్ అడిగిన కస్టమర్తొ చెప్పాడు బార్ జమాని. అతడు బయటకు వచ్చేశాడు. నాలుగడుగులు ముందుకేసి మరో ద్వారం గుండా బారులొపలికి వచ్చి ఫుల్ ఒకటిఅని అడిగాడు. వద్దు సార్ ఇంకా తాగితే ఇంటికి వెళ్లలేరు అని చెప్పి పనబ్బాయితొ రోడ్డు వరకూ పంపించాడు. అలా వెళ్లినాయన వెనుక వైపు నుంచి వచ్చి ఫుల్ బాటిల్ఆర్డరిచ్చాడు. మీకు ఎక్కువయిందని చెప్పానా, ఒరే అబ్బాయ్ ఈయన్ని ఆటో ఎక్కించ్చు అని పిలిచే సరికి.. ఏబారుకు వెళ్లినా నువ్వే ఉంటున్నావేంటి? అని చిరాకుగా అడిగాడు బార్ ఓనరుని.

Read more...

తప్పు తప్పే

21, డిసెంబర్ 2009, సోమవారం


పాపం ఉద్యోగిని మాత్రం బాస్ మినహాయించడు ఎందుకు?

బార్బర్ తప్పు చెస్తే… న్యూస్టైల్ అవుతుంది.
డ్రైవర్ తప్పు చెస్తే… కొత్తదారి దొరుకుతుంది.
తల్లిదండ్రులు తప్పు చేస్తే… కొత్త తరం పుడుతుంది.
సైంటిస్టు తప్పు చేస్తే… కొత్త ఆవిష్కరణ పుడుతుంది.
రాజకీయ నాయకుడు తప్పు చేస్తే… కొత్త చట్టమవుతుంది.
టైలర్ తప్పు చేస్తే… కొత్త డిజైన్ రూపొందుతుంది.
టీచర్ తప్పు చేస్తే… కొత్త పాఠమవుతుంది.
బాస్ తప్పు చేస్తే… కొత్త ఐడియాగా మారుతుంది.
ఉద్యోగి తప్పు చేస్తే….. అది తప్పే అవుతుంది.

ఇది సరదాకి మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.