హాస్యాంజలికి స్వాగతం...

వారు వీరైతే?

25, జులై 2010, ఆదివారం

Treason (Navy Justice, Book 1)
రామేశం: "ఇదేంట్రా నిన్నటి పేపర్ ధర్జగా చదువుతున్నావు?" అడిగాడు. 
కామేశం:  "ఇదివరుకుట్లా  పేపర్ కొనడం మానేశానోయ్. ప్రతి రోజు పత్రిక కొనగానే చుట్టుపక్కలున్న ప్రతి గాడిద అడిగేవాడే. విసుగెత్తి మానేశాను." చెప్పాడు.
రామేశం: "మరి   పేపర్ ఎవరిది?"
కామేశం: "పక్కింటి వారిది. ఇప్పుడే అడిగి తెచ్చాను."
రామేశం: అంటే ఇకనుండి........ 

Read more...

తెలివితేటలు

23, జులై 2010, శుక్రవారం

Fisher-Price Brilliant Basics Baby's First Blocksరమేష్: "రాధా రాధా.... బుజ్జిపండు మాటలు విన్నావా? చూడు రెండేళ్ళకే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో! నా తెలివితేటలన్నీ వీడికి వచ్చాయి" సంతోషంగా అన్నాడు.
రాధ: "అవును నిజమే. నా తెలివితేటలన్నీ నా దగ్గరే ఉన్నాయి" అన్నది.

Read more...

ఉచితం

21, జులై 2010, బుధవారం

The Berenstain Bears Go to the Doctor (First Time Books)"డాక్టర్ గారూ... నెను చాలా పేద వాడినండీ.... మీరడిగినంత ఫీజు ఇచ్చుకోలేను. ఎట్టాగైనా నాకు వైద్యం చేయండి బాబూ... కానీ జీవితాంతం నేను పైసా పుచ్చుకోకుండా మీ కుటుంబం అంతటికీ పని చేసి పెడతాను" వినయంగా అన్నాడా వ్యక్తి.

 "సరే... ఇంతకూ నువ్వేం పని చేస్తుంటావు?" అడిగాడు డాక్టర్.

"కాటికాపరినండీ... శవాలు తగలబెడుతుంటాను" అన్నాడతను.

Read more...

మిగిలింది-తగిలింది

19, జులై 2010, సోమవారం

Roland Premium Jasmine Rice from Thailand, 20-Pound Bag
భార్య : చూశారా! నాఉపవాసాల ఫలితం! ఈ నెల బియ్యం ఖర్చు రెండువందల రూపాయలు మిగిలింది.
భర్త : అవుననుకో! కాని.. పళ్ళషాపు వాడికి మాత్రమే ఇంకా వెయ్యి రూపాయలు బాకీఇవ్వాల్సి ఉంది

Read more...

నిద్ర కోసం

17, జులై 2010, శనివారం

శ్రీధర్: "డాక్టర్ గారూ... మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా..." అడిగాడు.
డాక్టర్: "చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు, సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు.
 శ్రీధర్: "కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు.

Read more...

ఇది మరీ అన్యాయం

15, జులై 2010, గురువారం

A Midsummer Night's Dream for Kids (Shakespeare Can Be Fun!)ప్రమోద్: "ఇది మరీ అన్యాయం. రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" అన్నాడు
తండ్రి: "అంత అన్యాయం ఏం జరిగిందిరా?" నవ్వుతూ అడిగాడు
ప్రమోద్: "లేకపోతే! మా టీచరేమో పుస్తకం చూస్తూ పాఠం చెబుతుంది. మమ్మల్ని మాత్రం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది, తప్పుదూ" ముక్కుపుటలు విశాలం చేస్తూ అన్నాడు

Read more...

పులికి చదువోచ్చునా?

14, జులై 2010, బుధవారం

ద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.
"భయపడకు ఆనంద్.... హఠాత్తుగా పులి ఎదురొచ్చినప్పుడు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి పత్రిక చదివిందా'' అని వణుకుతూ అన్నాడు ఆనంద్.

Read more...

సన్నాయి రాగం

11, జులై 2010, ఆదివారం

Pampers Sensitive Baby Wipes Refills, 192-Count Packages, Pack of Four (768 wipes)కొడుకు: "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" అడిగాడు తండ్రిని.
తండ్రి: "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు.
కొడుకు: "ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు అమాయకంగా.

Read more...

పులి బిడ్డ

5, జులై 2010, సోమవారం

మోహన్: మన వంశం ఎంత గొప్పదో తెలుసా! మా నాన్న పులిలా బ్రతికాడు. నేను అంతే. నువ్వు కూడా పులిబిడ్డలా బ్రతకాలి. సరేనా కొడుకుతో అన్నాడు.
కొడుకు: 'నిజమే నాన్న! అమ్మ కూడా ఇదే చెప్పింది'
మోహన్: 'ఎం చెప్పింది'
కొడుకు: 'నువ్వు మనిషివి కాదూ మృగానివని....'

Read more...

తేడా ఏముంది?

4, జులై 2010, ఆదివారం

Kitchens Of India Ready To Eat Palak Paneer, Spinach With Cottage Cheese, 10-Ounce Boxes (Pack of 6)కిశోర్: పెళ్ళయిన కొత్తలో ఇంట్లోకెళ్ళి బూట్లు విప్పుతూ ఉండగానే నా భార్య ప్రేమతో కాఫీ పట్టుకోచ్చేది. అప్పట్లో వాళ్ల కుక్క మాత్రం నన్ను చూడగానే అరుస్తూ ఉందేది. కాని ఇప్పుడంతా రివర్స్. ఆ కుక్క కాఫీ పట్టుకొస్తే ఆమె అరుస్తోందని సైకాలజిస్టుతో కష్టాలు చెప్పుకుంటున్నాడు .
సైకాలజిస్టు: చేసేవాళ్ళు మారినా అప్పుడూ ఇప్పుడూ మీకు చేసే సేవల్లో తేడా లేదు కదా. మరి సమస్యేమిటి? అడిగాడు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.