హాస్యాంజలికి స్వాగతం...

పులికి చదువోచ్చునా?

14, జులై 2010, బుధవారం

ద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ వణికిపోయారు.
"భయపడకు ఆనంద్.... హఠాత్తుగా పులి ఎదురొచ్చినప్పుడు చేతులు రెండు పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను." ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి పత్రిక చదివిందా'' అని వణుకుతూ అన్నాడు ఆనంద్.

Read more...

సన్నాయి రాగం

11, జులై 2010, ఆదివారం

Pampers Sensitive Baby Wipes Refills, 192-Count Packages, Pack of Four (768 wipes)కొడుకు: "నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" అడిగాడు తండ్రిని.
తండ్రి: "వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు.
కొడుకు: "ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు అమాయకంగా.

Read more...

పులి బిడ్డ

5, జులై 2010, సోమవారం

మోహన్: మన వంశం ఎంత గొప్పదో తెలుసా! మా నాన్న పులిలా బ్రతికాడు. నేను అంతే. నువ్వు కూడా పులిబిడ్డలా బ్రతకాలి. సరేనా కొడుకుతో అన్నాడు.
కొడుకు: 'నిజమే నాన్న! అమ్మ కూడా ఇదే చెప్పింది'
మోహన్: 'ఎం చెప్పింది'
కొడుకు: 'నువ్వు మనిషివి కాదూ మృగానివని....'

Read more...

తేడా ఏముంది?

4, జులై 2010, ఆదివారం

Kitchens Of India Ready To Eat Palak Paneer, Spinach With Cottage Cheese, 10-Ounce Boxes (Pack of 6)కిశోర్: పెళ్ళయిన కొత్తలో ఇంట్లోకెళ్ళి బూట్లు విప్పుతూ ఉండగానే నా భార్య ప్రేమతో కాఫీ పట్టుకోచ్చేది. అప్పట్లో వాళ్ల కుక్క మాత్రం నన్ను చూడగానే అరుస్తూ ఉందేది. కాని ఇప్పుడంతా రివర్స్. ఆ కుక్క కాఫీ పట్టుకొస్తే ఆమె అరుస్తోందని సైకాలజిస్టుతో కష్టాలు చెప్పుకుంటున్నాడు .
సైకాలజిస్టు: చేసేవాళ్ళు మారినా అప్పుడూ ఇప్పుడూ మీకు చేసే సేవల్లో తేడా లేదు కదా. మరి సమస్యేమిటి? అడిగాడు.

Read more...

దొరికితే దొంగ

29, జూన్ 2010, మంగళవారం

ద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" అన్నాడు ఓడిపోయేట్టున్న వెంకట్‌.
"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు శ్యామ్‌.
వెంకట్‌: బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?
శ్యామ్‌: నిజంరా నాకు దొరికింది
వెంకట్‌: ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?

Read more...

ముందే చెప్పాను

25, జూన్ 2010, శుక్రవారం


మండీ.... మనమ్మాయి పెన్సిల్ మింగేసింది ఆందోళనగా చెప్పింది శ్రీదర్ భార్య. ముందే రెండు పెన్సిళ్ళు కొందామంటే విన్నావు కావు. ఇప్పుడు నేను వెళ్లను, కావాలంటే నువ్వే వెళ్లి తెచ్చుకో చిరాగ్గా అన్నాడు శ్రీదర్.

Read more...

సిగ్గు


కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బె.. ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అని అరిచాడు.

"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.

Read more...

ఊ...కానీ

25, మే 2010, మంగళవారం

బరువు చూసుకునేందుకు వెయింగ్ మెషిన్ ఎక్కింది శిల్ప. రూపాయి నాణెం వేయగానే 50 కిలోలు అని చూపించింది.
తర్వాత తన హై హీల్స్ తీసేసి నాణెం వేసింది. ఈసారి 48 అని వచ్చింది.
స్వెట్టర్ తీసేసి మళ్ళి కాయిన్ వేసింది. ఈదఫా 46 వచ్చింది. చేతిలో చూసుకుంటే అప్పటికే రూపాయి బిళ్ళలు అయిపోయాయి.
బరువు చూసుకునేందుకు వచ్చి ఇదంతా చూస్తున్న శశికాంత్ ఆత్రుతగా అన్నాడు... కాయిన్స్ నేను వేస్తుంటానులెండి, మీరు కానివ్వండి, ఆపకండి...
అందుకు శిల్ప ఇలా అంది ముందు నినే వేస్తాను అని శశికాంత్ చెంపపై లాగి కొట్టింది.


Read more...

మూడు సూత్రాలు

3, మే 2010, సోమవారం

వివేక్: దేవితో ఏమీ మాట్లాడలేకపోతున్నాన్రా బాధగా చెప్పాడు స్నేహితుడితో
స్నేహితుడు: అమ్మాయిలతో మాట్లాడడం ఓ ఆర్టు. 1.ఆహారం, 2.కుటుంబం, 3.తర్కం... వీటి చుట్టూ నీ సంభాషణ ఉండేట్టు చూసుకో... ఎంతసేపైనా మాట్లాడతారు సలహా ఇచ్చాడు.
వివేక్‌కి ఓ రోజు దేవితో మాట్లాడే అవకాశం దొరికింది.
వివేక్: మీకు పిజ్జా ఇష్టమా? (1.ఆహారం)
దేవి: లేదు.
వివేక్: సంభాషణ ఎలా కొనసాగించాలో తెలియక, మీకు తమ్ముడున్నాడా? అన్నాడు ( 2.కుటుంబం).
దేవి: లేడు.
వివేక్: చివరి అస్త్రంగా తర్కాన్ని ప్రయొగించాడు. ఒకవేళ మీకు తమ్ముడు ఉండి ఉంటే, అతడికి పిజ్జా అంటే ఇష్టం ఉండేదా?
దేవి: !!!!!!!!!!!!!!

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.