నిజాయితీపరుడే
18, మార్చి 2010, గురువారం
విఠల్‌రావు పేపరు చదువుతున్నాడు. భార్య పక్కనే నిల్చుంది. వాళ్ల ముందు ప్రోగ్రెస్ కార్డు పెట్టేసి చప్పున జారుకున్నాడు కొడుకు.
మనవాడి మార్కులు చూసారా? ఆరువందల మార్కులకు మొత్తం కూడిన వంద రావట్లేదు. వాడి చదువు చూస్తుంటే కంగారుగా ఉందండీ అంది భార్య.
ఒక్క విషయానికి మాత్రం ఆనందంగా ఉంది అన్నాడు విఠల్‌రావు.
ఎందుకు?
వాడు ఎవరిదగ్గర కాపీ కొట్టలేదనేది కచ్చితం.
అదీ సంగతి
14, మార్చి 2010, ఆదివారం
శీను: ఏంటీ, నువ్వు ఏమన్నా సరే మీ ఆవిడ దించిన తల ఎత్తడం లేదా! వింతగా ఉందే, ఏం మంత్రం వేశావ్? ఆశ్చర్యంగా అడిగాడు.
వేను: తలెత్తినప్పుడు యాబై ఏళ్ల మనిషిలా తలదించుకుంటే ఇరవై ఏళ్ల అమ్మాయిలా ఉన్నావని చెప్పా, అంతే.
ఎవరు గొప్ప
13, మార్చి 2010, శనివారం
టీ తాగడానికి సూరి 'చంద్రం టీ కొట్టుకు' వెళ్ళాడు. అక్కడ చంద్రం తన గొప్పలు చెప్పుకుంటున్నాడు.
టీ కొట్టు చంద్రం: బిల్‌గేట్స్‌కు ఉన్నంత డబ్బు సంపాదించి అంతకన్నా గొప్పవాణ్ణి అవుతా
సూరి: గేట్స్‌కు ఉన్నంతే సంపాదిస్తే అతడూ నువ్వూ సమానం మాత్రమే అవుతారు కదా? అంటూ అనుమానంగా అడిగాడు.
టీ కొట్టు చంద్రం: బిల్గేట్స్కు నాలా టీ కొట్టు లేదుగా అందుకని నేనే గొప్ప అని బడాయిగా చెప్పాడు.
వాళ్లబ్బాయికి పదేళ్లు
9, మార్చి 2010, మంగళవారం
పండక్కి మంచి సూట్ కుట్టిచాలని ఖరీదైన బట్ట కొన్నాడు వీరేశం. దాన్ని తీసుకుని వాళ్ల వీదిలో
ఉన్న టైలర్ దగ్గరికి వెళ్లాడు.
బట్టను టేపుతో కొలిచి ఇది సరిపోదు సార్.... మీకు చిన్నదవుతుంది పెదవి విరచాడు దర్జీ.
అతడి మాటను నమ్మాలనిపించక మరో టైల దగ్గరికి వెళ్లాడు వీరేశం. బట్టను కొలిచి సంత్రప్తిగా
తలూపాడు రెండోదర్జీ.
వారంరోజుల తర్వాత సూట్ తెచ్చుకుందామని వెళ్లిన వీరేశానికి దర్జీ ఐదేళ్ల కొడుకు కనిపించాడు.
వాడికీ తన బట్టలోనే డ్రెస్ కుట్టినట్టు గమనించాడు.
నేనిచ్చిన బట్టలో నాకు సూట్ కుట్టావు, అందులో మిగిలిందానితో నీ కొడుక్కు కుట్టుకున్నావు.
సరే, నీమీద నాకు కోపంలేదు. నాకు అర్దం కానిదల్లా ఆపక్క వీది దర్జీ బట్ట సరిపోదని ఎందుకు
చెప్పాడు ఆశ్చర్యంగా అడిగాడు వీరేశం.
అదా.... వాళ్లబ్బాయికి పదేళ్లు సార్....
పాత నెట్‌వర్క్
5, మార్చి 2010, శుక్రవారం
రోహిత్ రోడ్డుమీద వెళ్తుంటే ఓ కుక్క అతని వెనుకే వెళ్తోంది. దాన్ని గమనించిన రోహిత్ నవ్వుకుంటున్నాడు.
ఎందుకు నవ్వుతున్నావు? అని పక్కనే ఉన్న మిత్రుడు అడిగాడు.
నేను మొన్ననే ఎయిర్టెల్ నంబర్ తీసుకున్నా. కానీ ఇప్పూడూ నా పాత నెట్‌వర్క్ ఫాలో అవుతుంటేనూ నవ్వుతూనే చెప్పాడు రోహిత్.