లాంఛనాలు
2, ఏప్రిల్ 2013, మంగళవారం

"అల్లుడుగారూ.. కట్నం విషయం కుదిరింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. Scooter, Colour TV, ఇవ్వాలనుకుంటున్నాం ఏవంటారు?" కాబోయే అల్లుడిని అదిగాడు రామనాధం."ఎందుకండీ నా కలాంటివేమీ వద్దు. ఒక Washing machine,Mixer ఇప్పించండి చాలు. నాకు పని తప్పుతుంది" అనాడు “ముందుచూపుతో” నారాయణ.
వర్గాలు:
కుటుంబంలో హాస్యం
అరుపు
1, ఏప్రిల్ 2013, సోమవారం

"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.
వర్గాలు:
కుటుంబంలో హాస్యం,
తండ్రి పిల్లల మద్య హాస్యం
ఈజిప్ట్ మమ్మీ
6, జనవరి 2013, ఆదివారం
కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?""నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.
"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"
వర్గాలు:
కుటుంబంలో హాస్యం,
తండ్రి పిల్లల మద్య హాస్యం
వెంట్రుక చెప్పిన నిజం
30, డిసెంబర్ 2012, ఆదివారం

"ఇవాళ వంట అమ్మా చేసిందా నాన్న?" అడిగాడు హైటెక్ కొడుకు.
"ఎలా కనుక్కున్నావురా?" అడిగాడు తండ్రి.
"పిజ్జాలో పొడవాటి వెంట్రుక వచ్చింది. మీది బట్టతల కదా" చెప్పాడు సుపుత్రుడు
వర్గాలు:
కుటుంబంలో హాస్యం,
తండ్రి పిల్లల మద్య హాస్యం
అబ్బో... దగ్గు
23, డిసెంబర్ 2012, ఆదివారం
రాఘవయ్య అర్దరాత్రి లేచి కుర్చిలొ కుర్చోని విపరీతంగా దగ్గుతున్నాడు.
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."
Read more...
అరగంట సేపు దగ్గిన తరువాత భార్యకు మండిపోయింది.
"అబ్బబ్బ... మీదగ్గు వినలేకపోతున్నాను" అన్నది.
"నన్ను మాత్రం ఏమి చేయమంటవు. ఇంతకన్న పెద్దగా దగ్గటం నావల్ల కాదు. ఖళ్ ఖళ్ ఖళ్...."
వర్గాలు:
కుటుంబంలో హాస్యం,
భార్య-భర్తల మద్య హాస్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)














.gif)

