హాస్యాంజలికి స్వాగతం...

ఊ...కానీ

25, మే 2010, మంగళవారం

బరువు చూసుకునేందుకు వెయింగ్ మెషిన్ ఎక్కింది శిల్ప. రూపాయి నాణెం వేయగానే 50 కిలోలు అని చూపించింది.
తర్వాత తన హై హీల్స్ తీసేసి నాణెం వేసింది. ఈసారి 48 అని వచ్చింది.
స్వెట్టర్ తీసేసి మళ్ళి కాయిన్ వేసింది. ఈదఫా 46 వచ్చింది. చేతిలో చూసుకుంటే అప్పటికే రూపాయి బిళ్ళలు అయిపోయాయి.
బరువు చూసుకునేందుకు వచ్చి ఇదంతా చూస్తున్న శశికాంత్ ఆత్రుతగా అన్నాడు... కాయిన్స్ నేను వేస్తుంటానులెండి, మీరు కానివ్వండి, ఆపకండి...
అందుకు శిల్ప ఇలా అంది ముందు నినే వేస్తాను అని శశికాంత్ చెంపపై లాగి కొట్టింది.


Read more...

మూడు సూత్రాలు

3, మే 2010, సోమవారం

వివేక్: దేవితో ఏమీ మాట్లాడలేకపోతున్నాన్రా బాధగా చెప్పాడు స్నేహితుడితో
స్నేహితుడు: అమ్మాయిలతో మాట్లాడడం ఓ ఆర్టు. 1.ఆహారం, 2.కుటుంబం, 3.తర్కం... వీటి చుట్టూ నీ సంభాషణ ఉండేట్టు చూసుకో... ఎంతసేపైనా మాట్లాడతారు సలహా ఇచ్చాడు.
వివేక్‌కి ఓ రోజు దేవితో మాట్లాడే అవకాశం దొరికింది.
వివేక్: మీకు పిజ్జా ఇష్టమా? (1.ఆహారం)
దేవి: లేదు.
వివేక్: సంభాషణ ఎలా కొనసాగించాలో తెలియక, మీకు తమ్ముడున్నాడా? అన్నాడు ( 2.కుటుంబం).
దేవి: లేడు.
వివేక్: చివరి అస్త్రంగా తర్కాన్ని ప్రయొగించాడు. ఒకవేళ మీకు తమ్ముడు ఉండి ఉంటే, అతడికి పిజ్జా అంటే ఇష్టం ఉండేదా?
దేవి: !!!!!!!!!!!!!!

Read more...

నాన్నకే...

25, ఏప్రిల్ 2010, ఆదివారం


కిట్టు: కోపం, బాధ రెండూ తగ్గడానికి మందులేమైన ఉన్నాయా మెడికల్ షాపతన్ని అడిగాడు.
మెడికల్ షాపతడు: ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు? అని అడిగాడు.
కిట్టు: ఇంకెవరికి, మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి అని చెప్పాడు.

Read more...

దొంగ కూర

19, ఏప్రిల్ 2010, సోమవారం

సూరమ్మ: ఈ రోజు మీ ఇంట్లో టమాట కూర చేశారు కదూ వదినా?
మణెమ్మ: "అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
సూరమ్మ: రాత్రి మా దొడ్లో టమాటలు ఎవరో దొంగవెధవలు కోసుకెళ్ళార్లే

Indian Tableware Copper Karahi with Lid

Read more...

పోలీసుకెందుకు జేబులు

17, ఏప్రిల్ 2010, శనివారం

పోలీసు నారాయణ: ఏంటయ్యా నా ప్యాంట్‍కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు టైలర్‍తో.
టైలర్: "పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు.

Read more...

శ్రీరామనవమి శుభాకాంక్షలు

24, మార్చి 2010, బుధవారం

Read more...

నిజాయితీపరుడే

18, మార్చి 2010, గురువారం

విఠల్‌రావు పేపరు చదువుతున్నాడు. భార్య పక్కనే నిల్చుంది. వాళ్ల ముందు ప్రోగ్రెస్‌ కార్డు పెట్టేసి చప్పున జారుకున్నాడు కొడుకు.
మనవాడి మార్కులు చూసారా? ఆరువందల మార్కులకు మొత్తం కూడిన వంద రావట్లేదు. వాడి చదువు చూస్తుంటే కంగారుగా ఉందండీ అంది భార్య.
ఒక్క విషయానికి మాత్రం ఆనందంగా ఉంది అన్నాడు విఠల్‌రావు.
ఎందుకు?
వాడు ఎవరిదగ్గర కాపీ కొట్టలేదనేది కచ్చితం.

Read more...

ఉగాది శుభాకాంక్షలు

16, మార్చి 2010, మంగళవారం

Read more...

అదీ సంగతి

14, మార్చి 2010, ఆదివారం

శీను: ఏంటీ, నువ్వు ఏమన్నా సరే మీ ఆవిడ దించిన తల ఎత్తడం లేదా! వింతగా ఉందే, ఏం మంత్రం వేశావ్? ఆశ్చర్యంగా అడిగాడు.
వేను: తలెత్తినప్పుడు యాబై ఏళ్ల మనిషిలా తలదించుకుంటే ఇరవై ఏళ్ల అమ్మాయిలా ఉన్నావని చెప్పా, అంతే.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.