హాస్యాంజలికి స్వాగతం...

తేడా ఏముంది?

4, జులై 2010, ఆదివారం

Kitchens Of India Ready To Eat Palak Paneer, Spinach With Cottage Cheese, 10-Ounce Boxes (Pack of 6)కిశోర్: పెళ్ళయిన కొత్తలో ఇంట్లోకెళ్ళి బూట్లు విప్పుతూ ఉండగానే నా భార్య ప్రేమతో కాఫీ పట్టుకోచ్చేది. అప్పట్లో వాళ్ల కుక్క మాత్రం నన్ను చూడగానే అరుస్తూ ఉందేది. కాని ఇప్పుడంతా రివర్స్. ఆ కుక్క కాఫీ పట్టుకొస్తే ఆమె అరుస్తోందని సైకాలజిస్టుతో కష్టాలు చెప్పుకుంటున్నాడు .
సైకాలజిస్టు: చేసేవాళ్ళు మారినా అప్పుడూ ఇప్పుడూ మీకు చేసే సేవల్లో తేడా లేదు కదా. మరి సమస్యేమిటి? అడిగాడు.

Read more...

దొరికితే దొంగ

29, జూన్ 2010, మంగళవారం

ద్దరు స్నెహితులు పందెం పెట్టుకొని టెన్నిస్ ఆడుతున్నారు. ఆట చివరికొచ్చాక బంతి కనిపించకుండా పోయింది. కాసేపు వెతికాక- "బాల్ లేదు కాబట్టి ఆట క్యాన్సిల్" అన్నాడు ఓడిపోయేట్టున్న వెంకట్‌.
"ఇదిగో దొరికింది" తన జేబులో బంతిని పడేసి అరిచాడు శ్యామ్‌.
వెంకట్‌: బోడి యాభై రూపాయల కోసం నన్ను మోసం చేస్తావా?
శ్యామ్‌: నిజంరా నాకు దొరికింది
వెంకట్‌: ఎలా దొరుకుతుంది? నేను దానిమీద నిల్చుంటే?

Read more...

ముందే చెప్పాను

25, జూన్ 2010, శుక్రవారం


మండీ.... మనమ్మాయి పెన్సిల్ మింగేసింది ఆందోళనగా చెప్పింది శ్రీదర్ భార్య. ముందే రెండు పెన్సిళ్ళు కొందామంటే విన్నావు కావు. ఇప్పుడు నేను వెళ్లను, కావాలంటే నువ్వే వెళ్లి తెచ్చుకో చిరాగ్గా అన్నాడు శ్రీదర్.

Read more...

సిగ్గు


కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బె.. ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అని అరిచాడు.

"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.

Read more...

ఊ...కానీ

25, మే 2010, మంగళవారం

బరువు చూసుకునేందుకు వెయింగ్ మెషిన్ ఎక్కింది శిల్ప. రూపాయి నాణెం వేయగానే 50 కిలోలు అని చూపించింది.
తర్వాత తన హై హీల్స్ తీసేసి నాణెం వేసింది. ఈసారి 48 అని వచ్చింది.
స్వెట్టర్ తీసేసి మళ్ళి కాయిన్ వేసింది. ఈదఫా 46 వచ్చింది. చేతిలో చూసుకుంటే అప్పటికే రూపాయి బిళ్ళలు అయిపోయాయి.
బరువు చూసుకునేందుకు వచ్చి ఇదంతా చూస్తున్న శశికాంత్ ఆత్రుతగా అన్నాడు... కాయిన్స్ నేను వేస్తుంటానులెండి, మీరు కానివ్వండి, ఆపకండి...
అందుకు శిల్ప ఇలా అంది ముందు నినే వేస్తాను అని శశికాంత్ చెంపపై లాగి కొట్టింది.


Read more...

మూడు సూత్రాలు

3, మే 2010, సోమవారం

వివేక్: దేవితో ఏమీ మాట్లాడలేకపోతున్నాన్రా బాధగా చెప్పాడు స్నేహితుడితో
స్నేహితుడు: అమ్మాయిలతో మాట్లాడడం ఓ ఆర్టు. 1.ఆహారం, 2.కుటుంబం, 3.తర్కం... వీటి చుట్టూ నీ సంభాషణ ఉండేట్టు చూసుకో... ఎంతసేపైనా మాట్లాడతారు సలహా ఇచ్చాడు.
వివేక్‌కి ఓ రోజు దేవితో మాట్లాడే అవకాశం దొరికింది.
వివేక్: మీకు పిజ్జా ఇష్టమా? (1.ఆహారం)
దేవి: లేదు.
వివేక్: సంభాషణ ఎలా కొనసాగించాలో తెలియక, మీకు తమ్ముడున్నాడా? అన్నాడు ( 2.కుటుంబం).
దేవి: లేడు.
వివేక్: చివరి అస్త్రంగా తర్కాన్ని ప్రయొగించాడు. ఒకవేళ మీకు తమ్ముడు ఉండి ఉంటే, అతడికి పిజ్జా అంటే ఇష్టం ఉండేదా?
దేవి: !!!!!!!!!!!!!!

Read more...

నాన్నకే...

25, ఏప్రిల్ 2010, ఆదివారం


కిట్టు: కోపం, బాధ రెండూ తగ్గడానికి మందులేమైన ఉన్నాయా మెడికల్ షాపతన్ని అడిగాడు.
మెడికల్ షాపతడు: ఇవిగో, ఈ బిళ్ళలు రెండు వేసుకుంటే ఎలాంటి మానసిక వేదనైనా చిటికెలో మాయమవుతుంది. ఇంతకీ ఎవరికీ బిళ్ళలు? అని అడిగాడు.
కిట్టు: ఇంకెవరికి, మా నాన్నకే. ఇవాళ నా ప్రోగ్రెస్ రిపోర్టు చూపించాలి అని చెప్పాడు.

Read more...

దొంగ కూర

19, ఏప్రిల్ 2010, సోమవారం

సూరమ్మ: ఈ రోజు మీ ఇంట్లో టమాట కూర చేశారు కదూ వదినా?
మణెమ్మ: "అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
సూరమ్మ: రాత్రి మా దొడ్లో టమాటలు ఎవరో దొంగవెధవలు కోసుకెళ్ళార్లే

Indian Tableware Copper Karahi with Lid

Read more...

పోలీసుకెందుకు జేబులు

17, ఏప్రిల్ 2010, శనివారం

పోలీసు నారాయణ: ఏంటయ్యా నా ప్యాంట్‍కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు టైలర్‍తో.
టైలర్: "పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.