హాస్యాంజలికి స్వాగతం...

ఆలస్యం

4, నవంబర్ 2012, ఆదివారం

"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం ?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పింది  స్టూడెంట్...

Read more...

పరాయి స్త్రీ

28, అక్టోబర్ 2012, ఆదివారం

"నేను పరాయి స్త్రీని తల్లిలా భావిస్తాను" గొప్ప చెప్పుకున్నాడు రాజేష్ తన Hi-tech loverతో.
"ఏఁ.. మీ నాన్న నీకు అమ్మాయినీ ప్రేమించడానికి ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover.

Read more...

Steel సామాను

21, అక్టోబర్ 2012, ఆదివారం

"ఏమిటండీ.... suitcase నిండా బట్టలన్నీ సర్దుకుని వెళ్తుతున్నారు. ఏదైనా campకా?" అడిగింది ఉమ భర్తని.
"Camp నా బొందా? Steel సామాన్లవాడిని నేను officeకి వెళ్ళగానే రమ్మన్నావుగా. అందుకె నాజాగ్రత్తలో నేనుండాలి" బయలుదేరాడు శ్రీధర్.

Read more...

మాయం

14, అక్టోబర్ 2012, ఆదివారం

"రెండు గంటల నుంచి నీతో మాట్లాడుతుంటే అస్సలు కాలం తెలియడం లేదు. నా తలనొప్పంతా మాయమైపోయింది." అన్నడు ధర్మారావు.
"! ఇప్పుడర్థమైంది. నా తలలోకి వచ్చిన నొప్పి మీదేనా?" అన్నాడు అర్జున్రావు.

Read more...

ఇంగ్లీషులో చెప్పు

7, అక్టోబర్ 2012, ఆదివారం

పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు
మాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..
విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..
మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..
విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..
మాస్టారు : ??!

Read more...

అగ్ని ప్రమాదం

4, అక్టోబర్ 2012, గురువారం

ఒక పెద్ద భవనం మంటల్లో ఆహుతైపోతున్నది. అప్పారావు అటుగా వెళ్తున్నాడు.
"అయ్యో..... అయ్యో... భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటివెంటనే Fire stationకి phone చెయ్యండి" అరిచాడు.
" కాలిపోయేది Fire Station నాయనా" బదులిచ్చాడో ఆసామి.

Read more...

స్కూలులో ఎవరంటే ఇష్టం?

27, సెప్టెంబర్ 2012, గురువారం

"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.

Read more...

1547 B.C.

29, ఆగస్టు 2012, బుధవారం


ఓ లారిడ్రైవర్, క్లీనర్ మ్యూజియం చూడడానికి వెళ్లారు. అక్కడో అస్థిపంజరం వేలడదిసి ఉంది. దాని కింద 1547 B.C. అని రాసి ఉంది. ఎంట్రోయ్ మొన్న లారి కిందపడి చచ్చిపోయినోడు ఈడేనా గుసగుసగా అన్నాడు డ్రైవర్. అవునవును..... లారినేంబరు కూడా రాశారు అని డ్రైవర్ను బయటకి లాక్కొచ్చాడు క్లీనర్.

Read more...

అర్జెంట్‌

18, ఆగస్టు 2012, శనివారం

తొందరగా రొండో అంతస్తుకి వెళ్లి ఆ పైల్‌ తీసుకురా బాయ్‌తో అన్నాడు పదో అంతస్తులో మీటింగ్‌లో ఉన్న రమేష్‌.
అర్ధ గంట తరువాత అలసిపోయి వచ్చాడు బాయ్‌.
అర్జెంట్‌గా రమ్మంటే ఇంత ఆలస్యమా... ఏం జరిగింది అని అడిగాడు రమేష్‌.
తొందరగానే లిప్ట్‌ దగ్గరికి వెళ్లాను సార్‌. కానీ లిప్ట్‌లో ఎమర్జెన్సీలో పక్కనున్న నిచ్చెనను
ఉపయెగించండి అని రాసుంది. అందుకే......

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.