హాస్యాంజలికి స్వాగతం...

నిద్ర

25, నవంబర్ 2012, ఆదివారం

"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అన్నాడు సూరిబాబు.
"ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పింది Doctor.

Read more...

బెలూన్

18, నవంబర్ 2012, ఆదివారం


నాదస్వర విద్వంసుడు నారదన్ వరండాలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తున్నాడు. పాప వచ్చి నమస్కరించింది.
"శుభమస్తు.. ఏం పాప నాదస్వరం నేర్చుకుంటావా? నెలకు నాలుగు వందలౌతుంది" అన్నాడు నారదన్.
"లేదంకుల్.. నా బెలూన్ ఎంతసేపు ఊదినా గాలి పోవడం లేదు. కొంచెం గాలి ఊది పెడతారేమోనని వచ్చాను" అన్నది.

Read more...

ప్రశాంతం

11, నవంబర్ 2012, ఆదివారం

"పెళ్ళై ఏభై ఏళ్ళు కాపురం చేసిన తరువాత ఇప్పుడు భార్యకు విడకులివ్వాలనుకుంటున్నారా? నాలుగైదేళ్ళలో మీరు కూడా చావబోతున్నారు?" కోపంగా అడిగాడు Judge.

"చచ్చేముందైనా కాస్త ప్రశాంతంగా చద్దామని యువరానర్" దవడలాడించాడు తాతారావు.

Read more...

ఆలస్యం

4, నవంబర్ 2012, ఆదివారం

"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం ?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పింది  స్టూడెంట్...

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.