హాస్యాంజలికి స్వాగతం...

పరువు మందగించింది

10, డిసెంబర్ 2009, గురువారం

రాహులు: ఇదిగో కుమారి! నా చూపు మందగించిందని మీ అమ్మతో చెప్పి నా పరువు తీయొద్దు అని తన బార్య కుమారిని హెచ్చరించాడు.
నేను కుమారిని కాదు బాబూ..... మీ అత్తను టక్కున సమాధానం వచ్చింది అక్కడినుండి.

Read more...

ఒకరికి ఒకరు

9, డిసెంబర్ 2009, బుధవారం


వృద్ధ దంపతులు హోటలుకు వెళ్లారు. ముందు ముసలాయన భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. భోజనం రాగానే తినడం మొదలుపెట్టాడు. ముసలామె భర్తనే చూస్తూ కూర్చుంది.
వీళ్ళనే గమనిస్తున్న పక్కటేబుల్ యువజంట రాజు,రేఖాకి అది ఆశ్చర్యంగా అనిపించింది.
రాజు: ఏం బామ్మగారూ..... మీరు భోంచెయ్యరా? అని అడిగాడు.
ముసలామె: ఆయనది కాగానే చేస్తానుబాబు వినయంగా చెప్పిందామె.
రేఖా: పతిదేవుడు ఆరగించనిదే బామ్మగారు పచ్చిమంచినిళ్ళు కూడా ముట్టరా వ్యంగ్యంగా అంది .
ముసలామె: మేము దేనైనా సగం సగం పంచుకుంటాం జవాబిచ్చిందామే.
రేఖా: కొంపదీసి..... భోజనం కూడానా?
ముసలామె: కాదు కట్టుడుపళ్ళను.

Read more...

ఎందుకు చెప్పనూ....

8, డిసెంబర్ 2009, మంగళవారం


విజయలక్ష్మి: పక్కింటాయన ఎందుకూ పనికిరాని సన్నాసటండి, వాళ్ళావిడ చెప్పింది అని భర్తతో అంది .
వెంకట్: సర్లే, నామీద నువ్వేమి చెప్పలేదుకదా, అనుమానంగా అడిగాడు.
విజయలక్ష్మి: భలేవారండి, నేనేమి చెప్పకపోతే ఆవిడమాత్రం ఎలా చెబుతుంది..... అసలు రహస్యం చెప్పేసింది.

Read more...

కుడి ఎడమైతే.....

7, డిసెంబర్ 2009, సోమవారం


చనిపోయి నరకానికి వెళ్ళాడు మాదవయ్య. ఏ శిక్ష కావాలో ఎంపిక చేసుకోమంటూ ఓ భటుడిని ఇచ్చి పంపాడు యముడు.
మాదవయ్య భటుడితో శిక్షలు అమలు జరిగే చోటుకి వెళ్ళాడు.
అక్కడ
ఓ పాపిని కొరడాతో కొడుతున్నారు. అది తన వల్ల కాదనుకున్నాడు.
కొంచెం
ముందుకేల్లాక ఒకతడిని మోకాళ్ల మీద నడిపిస్తున్నారు. అదీ ఇష్టం లేకపోయింది.
ఇంకాస్త ముందుకేల్లెసరికి అక్కడ ఒకతను పడుకొన్నాడు. అందమైన అమ్మాయి ఆయనకు ఒల్లుపడుతోంది.
మాదవయ్యకు
ప్రాణం లేచొచ్చింది. ఈ శిక్ష నాకు బాగుంది వెంటనే చెప్పాడు మాధవయ్య. అమ్మాయి.. ఇక నువ్వు వేల్లోచ్చు ఆజ్ఞాపించాడు భటుడు.
పాపం మాధవయ్య శిక్ష పడుకొన్నావాడికి కాదు ఆ అమ్మయికని తెలియక ఇరుక్కుపోయాడు

Read more...

విరుగుడు

6, డిసెంబర్ 2009, ఆదివారం


సుహాని: డాక్టర్ గారు ఉదయం ఇంట్లో చిన్న గోడవైంది. మా వారు నిధ్రమాత్రలనుకొని ఓ ముప్పై ఒళ్ళు నొప్పుల మాత్రల్ని ఒకేసారి మింగేశారు. ఏమన్నా అవుతుందంటారా ఫోనులో అడిగింది.
డాక్టర్: ఏంటి ఒల్లునోప్పుల మాత్రలు మింగాడా? అయితే ఓ పనిచేయండి ఒళ్ళంతా పచ్చిపుండయ్యేలా విరగోట్టండి. అన్ని మాత్రలకు ఆ మాత్రం నొప్పులు అవసరం సమాధానమిచ్చారు.

Read more...

సెలవుకోసం....

5, డిసెంబర్ 2009, శనివారం


గీతా.... మీ అమ్మను వెంటనే లోపలికి వెళ్ళమను మళ్లీ నేను చెప్పేవరకూ బయటకు రావద్దని చెప్పు మా బాస్ వస్తున్నాడు.
అని తన భార్య గీతతో గుసగుసగా చెప్పాడు సుధీర్.
గీత: మీ బాస్ వస్తే మా అమ్మ లోపలికేల్లడమెందుకు? అర్ధం కాక అడిగింది.
సుధీర్: మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటి నుంచి సెలవులో ఉన్నాను. అని సిగ్గు లేకుండా చెప్పాడు.

Read more...

ప్లాస్టర్ చెప్పిన నిజం

4, డిసెంబర్ 2009, శుక్రవారం


సుందరం ఓరోజు బాగా తాగి ఇంటికొచ్చాడు. బార్య చివాట్లు వేస్తుందన్న భయం పికుతూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా బెడ్రూంలోకి వెళ్లి, వాసన రాకుండా ఏదైనా చేయాలనీ ఆలోచించాడు. ఒక ఆలోచన తట్టింది. వెంటనే అద్దంలో చూసుకుంటూ నోటికి ప్లాస్టర్ వేసుకొని గప్ చుప్ గా పడుకున్నాడు. తెల్లారి బద్దకంగా ఒళ్ళు విరుచుకుని లేచిన సుందరాన్ని బార్య నిలదీసింది.
మళ్లీ తాగోచ్చారు కదూ!
లేదే తప్పించుకోజుశాడు సుందరం.
మరి ఈ అద్ధానికి ప్లాస్టర్ ఎవరు వేసినట్టు?

Read more...

కుక్కకాటుకు... చెప్పు దెబ్బ

3, డిసెంబర్ 2009, గురువారం



ఓ దేశపు చక్రవర్తి తన రాజ్యమంతటా పర్యటిస్తున్నాడు. ఓ గ్రామంలో అచ్చు తన పోలికలతో ఉన్న వ్యక్తి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు.
రాజు:
(దర్పంగా) ఏమయ్యా..... మా రాజమహల్లో మీ తల్లిగాని ఎప్పుడైనా పనిచేసిందా? అని ప్రశ్నించాడు.
రాజుగారి ప్రశ్నకు తొలుత తత్తరపడినా, అందులోని భావాన్ని గ్రహించిన ఆ సామాన్యుడు ఇలా సమాధానమిచ్చాడు.
సామాన్యుడు: ప్రభూ
! అంతఃపురంలో నా తల్లి పనిచేయ లేదుకాని, మా నాన మాత్రం కొంతకాలం పనిచేసినట్లు గుర్తు.

Read more...

అగ్గిమీద గుగ్గిలం

1, డిసెంబర్ 2009, మంగళవారం


పరమ పిసినారి ధనయ్య చావుబతుకుల్లో ఉన్నాడు. తన వాళ్లంతా చుట్టూ గుమిగూడారు.
ధనయ్య: కనకం ఏదీ...? పెగలని గొంతుతో భార్యను తల్చుకున్నాడు.
ధనయ్య భార్య: ఇదుగో ఇక్కడే ఉన్నానండీ చెప్పిందావిడ.
ధనయ్య: పిల్లలేరి.... ? మళ్లీ అడిగాడు.
ధనయ్య కొడుకులు: ఇక్కడే ఉన్నాం నాన్నా చెప్పారు కొడుకులు.
ధనయ్య: నా స్నేహితులు..?
ధనయ్య స్నేహితులు: అంతా ఇక్కడే ఉన్నాంరా..
ధనయ్య: మరి షాపుదగ్గర ఎవరున్నారు? లేని ఒపిక తెచ్చుకుంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.

Read more...

  © ఇది రాంగోపాల్ యొక్క బ్లాగు

ఈ పేజి మొదటికి వెళ్ళండి.